కొద్ది రోజుల క్రితం జరిగిన రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్, కానికా ధిల్లాన్ ల వివాహ వేడుక పార్టీలో రానా మరో సంచలనం చేసాడు. ఈ పార్టీకి రానా త్రిషతో కలిసి రావడమే కాకుండా అప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త జంటలా అందంగా ముస్తాబై చట్టాపట్టలు వేసుకుని ఆ పార్టీలో కనపడటం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. గతంలో రానా త్రిషలు జంటగా పబ్ లలోను, హోటల్స్ లోను కలిసి సందడి చేసిన సందర్భాలు ఉన్నా ఇలా జంటగా ఒక టాలీవుడ్ సేలిబ్రెటీ వివాహ వేడుకలో సందడి చేయడం ఇదే ప్రధమం. దీనితో ఆ పార్టీకి వచ్చిన అతిధులు అంతా ప్రకాష్, కానికా ధిల్లాన్ ల కొత్త జంటను చూడకుండా రానా త్రిషల వైపు ఆశ్చర్యంగా చూడటం ఆ పార్టీకి హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో రానా త్రిషల ప్రేమ వ్యవహారానికి సంబంధించిన గాసిప్పులు ఆగిపోవడంతో ఇక వీరి ప్రేమ మరుగున పడిపోయింది అని అనుకున్నారు అంతా. అయితే తిరిగి ఈ జంట ఇలా ప్రత్యక్షం కావడం టాలీవుడ్ లో సంచలన వార్తగా మారింది. ఈ పార్టీ తరువాత మీడియా త్రిష వద్ద ఈ పార్టీ టాపిక్ కదిపి రానా తో మీ పెళ్ళి ఎప్పుడు? అని సూటిగా ప్రశ్నిస్తే ఆమె ముసిముసి నవ్వులు నవ్వుతూ తాను పెళ్లి గురించి నిర్ణయించుకున్న తరువాత తానే మీడియాను పిలిచి చేపుతాననీ అప్పడి వరకు తనను వదిలేయండి అనీ చెప్పి వెళ్ళిపోవడం ఈ గాసిప్పులకు మళ్ళీ ప్రాణం పోసింది. అయితే రానా మాత్రం మీడియాకు దొరకకుండా ఉన్నాడని టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: