మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు అమ్మాయికి పిలిచి హీరోయిన్ ఛాన్స్ యివ్వడం టాలీవుడ్ కు షాకింగ్ న్యూస్ గా మారింది. ఒకప్పటి అర్చన నేటి వేద గా పేరు మార్చుకున్నా మన టాలీవుడ్ హీరోలు ఎవ్వరు ఆమెను పట్టించుకోలేదు. చిరవరకు అవకాశాలు రాకపోవడంతో శివాజీ లాంటి చిన్న హీరోతో ‘కమలతో నా ప్రయాణం’ లాంటి సినిమాలు చేసి కాలం గడుపుతోంది వేద. ఈమె మంచి క్లాసికల్ డాన్సర్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెర డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించిన వేద కు అనుకోని అదృష్టం మోహన్ లాల్ రూపంలో వచ్చింది. తెలుస్తున్న సమాచారం మేరకు మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలో వేద మధ్య తరగతి గృహిణిగా కనిపించ బోతోంది. ప్రస్తుతం కన్నడంలో ‘మైత్రీ’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించిన వేద తమిళంలో ‘నాడోడి వంశం’ అనే సినిమాలో నటిస్తోంది. మోహన్ లాల్ తో నటించడం ఒక అపూర్వ అదృష్టంగా భావిస్తున్నానని వేద మీడియాకు చెపుతోంది.  తెలుగు హీరోయిన్స్ వేద, స్వాతి లాంటి హీరోయిన్స్ ను మన తెలుగు సినిమా రంగం అంతగా గుర్తించ పోయినా పర భాషా సినిమా హీరోలు మన తెలుగు హీరోయిన్స్ కు పిలిచి అవకాశాలు ఇవ్వడం ఇప్పుడు సంచనంగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: