రామ్ చరణ్ చేయబోతున్న కామెడీ ప్రయోగం చరణ్ అభిమానులను షేక్ చేస్తోంది ఆనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు యాక్షన్ హీరోగా యూత్ లో, మాస్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకుని టాలీవుడ్ టాప్ యంగ్ హీరోల నెంబర్ వన్ రేసులో ఉన్న రామ్ చరణ్ తన హై వోల్టేజ్ సినిమాలకు కాస్త విరామం ప్రకటించి కృష్ణవంశీ ‘గోవిందుడు అందరివాడేలే’ లో డిఫరెంట్ లుక్ లో కనిపించడమే కాకుండా కామెడి ట్రాక్ ను కూడ పండించాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా, రామ్ చరణ్ కొత్తగా నటించబోతున్న సినిమాలలో ఎక్కువ శాతం కామెడి ట్రాక్ ఎక్కువగా ఉండబోతోంది అనే వార్తలు చరణ్ అభిమానులను భయ పెడుతున్నాయాట ‘గోవిందుడు’ సినిమా పూర్తి కాగానే శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న చరణ్ ఈ సినిమా కూడ పూర్తి కాగానే కోన వెంకట్ గోపీ మోహన్ ల స్క్రిప్ట్ కు ఓకె చేసాడు అనే వార్త చరణ్ అభిమానులను టార్చర్ పెడుతోంది అని అంటున్నారు. కోన వెంకట్ గోపీ మోహన్ ల సినిమాలు అంటేనే కామెడీ ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా వరసగా మూడు కామెడీ ఎలిమెంట్ సినిమాలను చరణ్ చేస్తే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ కు ఉన్న మాస్ హీరో ఇమేజ్ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి చరణ్ తన ఇమేజ్ కు భిన్నంగా ఈ కొత్త ప్రయోగాలు ఎందుకు చేస్తున్నాడు అంటూ అభిమానులు మధన పడుతున్నారని టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: