రోజుకు ఒక మాట మార్చే క్యూట్ హీరోయిన్ సమంత రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉంటుంది. అయితే కోలీవుడ్ క్వీన్ గా ఎదుగుదామనుకున్న సమంత కోరికను నిరాశ పరుస్తూ ఆమె కోలీవుడ్ టాప్ హీరో విజయ్ తో కలిసి నటించిన ‘కత్తి’ సినిమా రాజకీయ దుమారంలో చిక్కుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను విడుదల కాకుండా అడ్డుకోవాలి అంటూ తమిళనాడులోని పురట్చిభారతం పార్టీ వర్గీయులు నిన్న బుధవారం ఆందోళన నిర్వహించారు. చెన్నైలోని నుంగంబాక్కంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఈ పార్టీ మద్దతు దార్లు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే మద్దతుదారులు ఈ సినిమాను నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ ఈ సినిమాను విడుదలను నిలిపివేయకపోతే తాము రాజకీయ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.  అంతేకాదు తాము హీరో విజయ్‌, చిత్ర దర్శకుడు మురుగదాస్‌ ఇళ్లను ముట్టడిస్తామని కూడ హెచ్చరించారు. ఎల్టీటీఇ ప్రభాకరన్‌ కుమారుడు బాలచంద్రన్‌ను మట్టు పెట్టిన రాజపక్సే మద్దతు దార్లు నిర్మించిన ‘కత్తి’ సినిమా విడుదల అయితే అది తమిళ జాతికి జరిగిన తీవ్ర అన్యాయంగా తాము పరిగణిస్తామని ఈ ఉద్యమ కారులు అభిప్రాయ పడుతున్నారు. దీపావళికి విడుదల అవుతుంది అని అనుకుంటున్న ఈ ‘కత్తి’ సినిమా పై సమంత చాల ఎక్కువ ఆసలు పెట్టుకుంది. సూర్య సినిమా ‘సికిందర్’ లో అందాలు ఆరబోసినా కలిసి రాకపోవడంతో కనీసం విజయ్ అయినా గట్టెక్కిస్తాడు అని అనుకుంటే ‘కత్తి’ చుట్టూ రాజకీయ దుమారాలు అలుము కోవడంతో సమంతకు కోలీవుడ్ కలిసి రాదేమో అని అనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: