మూడు పదుల వయసు దాటి పోయినా తన గ్లామర్ తో కోలీవుడ్, టాలీవుడ్ లను షేక్ చేస్తున్న నయనతార తన అసలు గుట్టు విప్పింది. నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్. పుట్టింది పెరిగింది కేరళ అయినా ఏలుతున్నది మాత్రం తమిళ, తెలుగు సినిమా రంగాలను. నయన్ నటించిన మొదటి సినిమా ‘మనస్సినక్కరే’ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ సినిమా దర్శకుడు సత్యన్ నయన్ ను తన పేరును మార్చుకోమని సూచించాడట. అయితే ఏ పేరు పెట్టుకుంటే బాగుంటుందో తెలియని అయోమయంలో ఉన్న అలనాటి డయానా మరియమ్ కురియన్ చూసి 30 పేర్లు చీటీల పై రాసి బౌల్ లో  వేసాడట.  ఆ బౌల్ లో ఉన్న స్లిప్ లలో ఒకటి తీసుకోమని ఈనాటి నయన్ కు దర్శకుడు సత్యన్ సూచిస్తే అలనాటి డయానా చేతికి నయనతార అనే పేరు వచ్చిందట. విచిత్రంగా ఉన్న ఈ పేరును చూసి తనకు ఈ పేరు నప్పుతుందా అని ఆ దర్శకుడిని అడిగిందట నయనతార. దర్శకుడు సత్యన్ తనకు ఈ పేరు నప్పుతుందని చెప్పినా చాలా కాలం వరకు ఈ పేరును బయట వాళ్లకు చెప్పడానికి సంకోచ పడేదట నయనతార.  కానీ ఆనాడు ఆమెకు ఇదే పేరు దక్షిణాది సినిమా రంగంలో కోట్లు కురిపిస్తుంది అన్న విషయం అప్పుడు ఆమెకు తెలియదు. అదే ఆమె పేరులో ఉన్న అదృష్టం.  

మరింత సమాచారం తెలుసుకోండి: