ఎన్నికల తరువాత మౌన ముద్ర వహించిన పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటమే కాకుండా నిన్న సాయంత్రం హైదరాబాద్ లో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిసి తన తదుపరి రాజకీయ ఎత్తుగడలకు పదును పెట్టాడు. అమీత్ షా పవన్ లు ఏకాంతంగా ఒక గంట సేపు నగరంలోని అమీత్ షా బస చేసిన ఒక ప్రముఖ హోటల్ లో చర్చలు జరపడం తిరిగి పవన్ తన రాజకీయ స్పీడ్ ను పెంచబోతున్నాడు అనే సంకేతాలను యిచ్చింది. ఈ భేటీ తరువాత మీడియాతో మాట్లాడిన పవన్ తాను మామూలుగానే అమిత్ షాను కలిశానని, గ్రేటర్ ఎన్నికలపై ఇంకా ఆలోచించలేదని పవన్ అన్నాడు.  అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ పరిపాలనగురించి మాట్లాడుతూ కేవలం మూడు నెలలలో అద్భుతాలు జరగవని, చాలమంది చెపుతున్నట్లుగా మోడీ చందమామ కధలను చెపుతున్నారు అనే విషయాన్ని తాను అంగీకరించననీ స్పష్టంగా తెలియచేస్తూ, ఇప్పట్లో తాను మోడీని ప్రశ్నించను అనే సంకేతాలు ఇచ్చాడు పవన్.  అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కలిసి చర్చించుకుంటే ఇరు రాష్ట్రాలలో ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవి కావని అభిప్రాయ పడ్డాడు పవన్. ఎన్నికల తరువాత భారతీయ జనతాపార్టీ అగ్ర నేతతో పవన్ భేటీ కావడం మీడియా ముందుకు రావడం ఇదే ప్రప్రధమం కావడంతో పవన్ చేసిన రాజకీయ కామెంట్లకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: