ఊహించని బహుమతులతో మెగా అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక వైపు చిరంజీవి లేటెస్ట్ ఫోటో లుక్ మెగా అభిమానులకు పండుగగా మారిస్తే ఇంతేకాదు అన్నట్లుగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మరో మెగా కుటుంబ వారసుడు తన పెదనాన్నకు తన ముకుందుడి ఫస్ట్ లుక్ బహుమతిగా ఇచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఈ ఫస్ట్ లుక్ చూసిన అభిమానులు చేస్తున్న కామెంట్స్ ఆశక్తిదాయకంగ ఉన్నాయి. ‘ముకుంద’ లో వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ను చూస్తూ ఉంటే చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ల పోలికలతో వరుణ్ తేజ్ ఉన్నాడు అంటూ మెగా అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. అంతేకాదు మరి కొంతమంది మెగా వీరాభిమానులైతే చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ రూపాలను ఫొటోషాప్‌లో డిజైన్ చేస్తే వచ్చే రూపంగా వరుణ్ తేజ్ ముకుందుడి ఫస్ట్ లుక్ ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు చాల బాగున్నాయి అంటూ ఆడియో విడుదల కాకుండానే ఈ సినిమా ఆడియో పై ఫిలింనగర్ లో పోజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీపావళికి సందడి చేయబోతున్న ఈ ‘ముకుందుడు’ మెగా వారసత్వాన్ని ఎంత వరకూ కొనసాగిస్తాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: