రకరకాల రూమర్ల హడావిడి తరువాత ఎట్టకేలకు ఒడ్డున పడి ‘రభస’ వినాయక చవితికి సందడి చేయబోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఛానల్స్ లో పబ్లిసిటీ హడావిడి ఇంకా ప్రారంభం కాకపోవడానికి ప్రధాన కారణం జూనియర్ అనే మాటలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం గత దసరాకు విడుదలైన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా అని అంటున్నారు. గత సంవత్సరం ‘రామయ్య’ సినిమా విడుదలకు 15 రోజుల ముందు నుంచే ఆ సినిమాకు భారీ పబ్లిసిటీ ఇవ్వడంతో జూనియర్ అభిమానులలో విపరీతమైన అంచనాలు పెరిగి ఆ అంచనాలు అందుకోలేక జూనియర్ కు ‘రామయ్య’ పీడకలలా మారింది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జూనియర్ తన ‘రభస’ కు తక్కువ పబ్లిసిటీ ఇచ్చి లో ప్రొఫైల్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టాలని సరికొత్త ఆలోచనలతో జూనియర్ ‘రభస’ కు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు అని ఫిలింనగర్ టాక్. దీనికి తోడు ‘రభస’ పాటలు, ట్రైలర్ కూడ జూనియర్ అభిమానులకు పూర్తిగా సంతృప్తిని ఇవ్వలేదు అనే టాక్ జూనియర్ దృష్టికి రావడంతో ఎన్టీఆర్ ఈ వ్యూహత్మక ఎత్తుగడ వేసాడు అని అంటున్నారు. పేరుకు ఈ సినిమా టైటిల్ ‘రభస’ అయినా ఫ్యామిలీ సెంటిమెంట్ తో జూనియర్ దిగుతున్నాడు కాబట్టి, ఎన్టీఆర్ ఈ కొత్త ఎత్తుగడ వేసాడు అని అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: