అమెరికా లండన్ ల నుండి దిగుమతి అయిన ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ ఒక వైరస్ లా మారి బాలీవుడ్ నుంచి మన టాలీవుడ్ కు కూడా పాకింది. ఎ.ఎల్.ఎస్. అనే సంస్థ నరాల వ్యాధితో బాధపడేవారి కోసం ఈ చన్నీటి బకెట్ స్నానం కాన్సెప్ట్ చేపట్టింది అనే విషయం తెలిసిందే. ఈ కాన్సెప్ట్‌ను ఇష్టపడేవారు తాము ఐస్ బకెట్ స్నానం చేసి తమకు తెలిసిన మరో ముగ్గురుని ఇలా చేయగలరా అని రెచ్చగొట్టే కాన్సెప్ట్ ఇది. ఇప్పటికే బాలీవుడ్ లో అభిషేక్‌బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్, సోనాక్షి వంటి స్టార్ట్ ఐస్ బకెట్ స్నానం చేసి యూట్యూబ్ లో సంచలనాలు చేస్తే ఈ కాన్సెప్ట్ ను ఇప్పటికే టాలీవుడ్ బ్యూటీ హన్సిక తలకెత్తుకుని యూట్యూబ్ లో సంచలనాలు చేస్తోంది. ఇంతమంది హడావిడి చేస్తూ ఉంటే తానేమి తక్కువ కాదంటూ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ స్వీకరించి తన సన్నిహిత మిత్రులైన నితిన్, హర్షవర్ధన్ రాణే, దగ్గుబాటి రానాలకు ఓ సవాల్ విసిరిందని సమాచారం. అయితే ఈమె సవాల్ ను ఈ ముగ్గురూ తీసుకుని ఆమె ఛాలెంజ్ కి ఎటువంటి బదులు ఇస్తారో అన్న ఆశక్తితో పాటు జ్వాల సన్నిహిత మిత్రుడు హీరో నితిన్ ఎలా స్పందిస్తాడో అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: