సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాంచి దూకుడు మీదున్నాడు. ఆ దూకుడుని సీక్వెల్స్ మీద కూడా చూపిస్తున్నాడు. ఆ కోవలో 'ఐస్‌క్రీమ్ 3'కి కూడా ప్లాన్ చేశాడు. ఇప్పటికే 'ఐస్‌క్రీమ్-2' షూటింగ్ పూర్తయింది. కేవలం ఏడు రోజుల్లో దీని షూటింగును పూర్తి చేశాడు.
ఐస్ క్రీమ్-2 విడుదల కాకముందే ఏకంగా 'ఐస్ క్రీమ్-3' సినిమాను కూడా అనౌన్స్ చేశాడు వర్మ. అంతే కాదు 'ఐస్ క్రీమ్' సిరీస్ లో ఇక పై నెలకో సినిమా ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తారట. 'ఐస్ క్రీమ్ 2'కి సంబంధించిన 20 ఫస్ట్ లుక్స్ ను ఒకేసారి తాజాగా విడుదల చేసిన వర్మ పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. 20 ఫస్ట్ లుక్స్ పేరిట తాజాగా వర్మ ఓ కార్యక్రమం నిర్వహించాడు. మూస పద్ధతులకు భిన్నంగా ఒకేసారి 20 ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేస్తున్నామని వర్మ తెలిపాడు.
సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. అందుకు ఓ నాలుగు రోజుల ముందు.. అంటే సెప్టెంబర్ 15న ‘ఐస్‌క్రీమ్-3’ చిత్రాన్ని ప్రారంభించబోతున్నామని చెబుతున్నాడు వర్మ. ‘ఐస్‌క్రీమ్’ సిరీస్ నుంచి ఇకపై నెలకు ఓ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామంటూ కొత్త టాపిక్ కు తెర తీశాడు వర్మ. మొత్తానికి వర్మ తన తీరుతో నిత్యం వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తూనే వుంటాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: