కన్నడ బ్యూటీ ప్రణిత పవన్ సినిమా ‘అత్తారిల్లు’ పుణ్యమా అని గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. టాప్ యంగ్ హీరోలందరితోను ప్రణిత నటించడానికి ఉబలాట పడుతున్నా ప్రణితకు మాత్రం ఇంకా టాప్ హీరోల సినిమాలలో సెకండ్ హీరోయిన్ పాత్రలే వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ మధ్య ఈ అందాల బాపు బొమ్మ సినిమాలలలో హీరోయిన్స్ జీవితాల గురించి ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. సినిమాల్లోకి వచ్చాక నిజ జీవితంలో ఇష్టంలేని పనులు కూడా నో చెప్పకుండా చేయాల్సిందేనని ప్రణీత అభిప్రాయపడింది. పెద్ద హీరోయిన్ గా ఎదగాలి అంటే సినిమా రంగంలో వ్యక్తిగతంగా ఇష్టంలేని పనులకు మనసుకు నచ్చినా నచ్చకపోయినా చేయాలని అలా చేయకుంటే సినిమారంగంలో నిలబడటం కష్టం అని కామెంట్ చేసింది.  అయితే ఈ కామెంట్స్ వెనుక ఉన్న అర్ధం హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ విషయంలోనా? లేదా మరేదైనా విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణిత ఈ కామెంట్స్ చేసిందా అనే విషయం పై రకరకాల అర్ధాలను విశ్లేషకులు తీస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే సక్సస్ బాట బట్టి టాప్ యంగ్ హీరోలతో సినిమాలు చేస్తున్న ప్రణితకు ఈ వైరాగ్యం ఏమిటి అంటూ సెటైర్లు కూడ పడుతున్నాయి. అయితే ప్రణిత తన వ్యక్తిగత జీవితంలో జరిగిన తనకు ఇష్టంలేని సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ కామెంట్స్ చేసింది అనేవారు కూడ ఉన్నారు. త్వరలో జూనియర్ సరసన ‘రభస’ చేయబోతున్న ప్రణిత మాటలకు రానున్న కాలంలో అర్ధాలు తెలిసే అవకాశం ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: