నటుడు ఉత్తేజ్ కు టాలీవుడ్ సినిమా రంగంలో మంచి పేరుంది. మంచి నటుడిగా పేరు వచ్చినా అతడి స్థాయికి తగ్గ పాత్రలు ఇంకా రాకపోవడంతో ఉత్తేజ్ కెరియర్ అంతంత మాత్రంగానే ఉంటోంది. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఎందరో నటులు వీరాభిమానులుగా ఉన్నట్లే ఉత్తేజ్ కూడా చిరంజీవికి వీరాభిమాని. నిన్న జరిగిన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వేలాది మంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసి పర్యావరణ కోసం చెట్లను నాటి తమ మెగా భక్తిని చాటుకుంటే ఉత్తేజ్ ఒక సుదీర్ఘ కవిత చిరంజీవి పై రాసి వెబ్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇప్పుడా కవిత చిరంజీవి అభిమానులకు హాట్ న్యూస్ గా మారి వెబ్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  నిన్న జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న వందలాది అభిమానుల సమక్షంలో రామ్ చరణ్ మరొక నెలరోజులలో చిరంజీవి 150వ సినిమా విషయం పై క్లారిటీ ఇస్తాను అనే ప్రకటన చేయడమే కాకుండా ఆ వేడుకకు హాజర్ అయిన అనేక మంది చిరంజీవి అభిమానులను చిరంజీవి 150వ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుంది అన్న విషయం పై రామ్ చరణ్ సన్నిహితులు మెగా అభిమానుల అభిప్రాయాలను సేకరించారు అనే వార్తలు కూడ వస్తున్నాయి. ఈ అభిప్రాయ సేకరణలో చాలామంది చిరంజీవి అభిమానులు చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడిగా వినాయక్ లేదా బోయపాటి పేర్లను సూచించినట్లు ఫిలింనగర్ లో గాసిప్పుల హడావిడి జరుగుతోంది. ఏమైనా మెగా హీరో సినిమాకు కౌంట్ డౌన్ మొదలైంది అనే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: