పవన్ కళ్యాణ్ సినిమాల పాటలను టైటిల్స్ గా పెట్టుకుని ఇప్పటి దాకా చాల సినిమాలు విజయం సాధిస్తే పవన్ పేరిట ఏర్పడ్డ పవనిజమ్ వాదాన్ని సినిమా టైటిల్ గా పెట్టుకుని సరికొత్త ప్రయోగం చేస్తూ నూతన నటీనటులతో నిర్మించిన ‘పవనిజం’ సినిమా పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలవుతుంది అనే వార్తలు సంచలనంగా మారాయి. సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ పుట్టినరోజు కాబట్టి అదే వారంలో ఈ సినిమాను విడుదల చేస్తే పవన్ అబిమానులకు ఆనందంగా ఉంటుంది అన్న ఆలోచన మంచిది అయినా అత్యంత భారీ సినిమాగా విడుదల అవుతున్న జూనియర్ ‘రభస’ విడుదల తరువాత కేవలం వారం గ్యాప్ లో ఇటువంటి చిన్న సినిమా విడుదల చేస్తే జనం చూస్తారా అనే ఆశక్తికర చర్చ ఫిలింనగర్ లో జరుగుతోంది.  పవన్ అభిమానులు తలుచుకుంటే సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురావచ్చో అనే కథాంశంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ఆడియోకు మంచి టాక్ వచ్చిందని ఫిలింనగర్ వర్గాల సమాచారం.  పవన్ ఫ్యాన్స్ కి పవనిజం కచ్చితంగా ఒక మరువలేని గిఫ్ట్ అని చెపుతూ నిజమైన హీరో అభిమానులు సమాజానికి ఎలాంటి సేవ చేస్తే తమ అభిమాన హీరోకి పేరు ప్రఖ్యాతులు వస్తాయో తెలిపే వెరైటీ కధా వస్తువుతో నిర్మించిన ఈ సినిమాను పవన్ అభిమానులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: