పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో. తను వరుస పెట్టి మూవీలను తీయాలి కాని, అభిమానులు, సినీ ప్రేక్షకులు సైతం వాటిని చూడటానికి బారులు తీరి మరీ టెకెట్స్ కొనుక్కుంటారు. హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండాతన మూవీకి కలెక్షన్స్ పెరుగుతూ వస్తుంటాయి. అంతే కాకుండా తను నటించిన తాజా చిత్రాలు టాలీవుడ్ బాక్సాపీస్ ని సైతం షేక్ చేశాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన ముందు ఉన్న రెండు చిత్రాలను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. గోపాల గోపాల మూవీ, అలాగే గబ్బర్ సింగ్2 మూవీల అనంతరం పవన్ కళ్యాణ్ మూవీలకు గుడ్ బై చెప్పినట్టే అని టాక్. దాంతో పవన్ కళ్యాణ్ సినీ జీవితం ప్రస్తుతానికి ముగిసింది. తరువాత తను రాజకీయంగా విప్లవాత్మకమైన మార్పును తీసుకురావటాని ప్రయత్నించబోతున్నాడు. సరిగ్గా ఇదే విషయాన్ని పాయింట్ గా తీసుకొని పవన్ వ్యక్తిగత జీవితం, అలాగే గ్లామర్ స్టార్ డం సంపాదించుకున్న తీరు, కష్టపడిన తత్వం వంటి విషయాలతో ఓ మూవీ త్వరలోనే తెరకెక్కబోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్టోరి ప్రిప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ జీవిత కథపై ఓ మూవీని తెరకెక్కించబోతున్నారు అంటూ అఫిషియల్ స్టేట్ మెంట్ రానుందని ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం. పవన్ కళ్యాణ్ సన్నిహితుల వద్ద నుండి అందిన సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ సైతం ఆ మూవీకి సంబంధించిన కథని పరిశీలించిన తరువాతే కథకి గ్రీన్ సిగ్నల్ చెబుతాడని అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ జీవిత కథ అప్పుడే సినిమా రూపంలో బయటకు రానుందన్నమాట. అయితే ఇందులో మనం పవన్ కళ్యాణ్ హీరోగా చూస్తే ఇంకా బాగుండేదని అంటున్నారు సిని అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: