వేధింపులు భరించలేక ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పటికీ అతనిలో మార్పు రాకపోగా మరింతగా రెచ్చిపోయి మళ్ళీ వేదింపులకు దిగడంతో ఇక భరించే ఓపిక లేకపోవడంతో జూనియర్ ఆర్టిస్ట్ నిషా బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. జూనియర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించిన నిషా కిషన్ అలియాస్ సమీర్ అనే వ్యక్తిని ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం నిషా గర్భవతి ,వాళ్ళిద్దరూ కూడా అంబేద్కర్ నగర్ లో నివాస ముంటున్నారు . భర్త ప్రవర్తన తో విసిగి వేసారిన నిషా బుధవారం రోజున కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోగా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు .

మరింత సమాచారం తెలుసుకోండి: