ఢిల్లీ బ్యూటీ తాప్సీ స్టైల్ చాల డిఫరెంట్ గా ఉంటుంది. పెద్దపెద్ద అద్దాలున్న కళ్ళజోళ్ళు పెట్టుకుని వెస్ట్రన్ స్టైల్ లో డ్రస్సులు వేసుకుంటూ హడావిడి చేసే తాప్సీ ఎక్స్ పోజింగ్ విషయంలో కూడ చాల బోల్డ్ గా ఉంటుంది. అయితే మంచి నటిగా పేరుండి నటించినా ఇంచుమించు అన్ని సినిమాలు పరాజయం చెందడంతో ప్రస్తుతం ఆమెకు తెలుగులోను తమిళంలోను అవకాశాలు కరువైపోయాయి.  బాలీవుడ్‌లో మాత్రం ఇప్పుడిప్పుడే క్రేజ్ సంపాదిస్తున్న తాప్సీ ఓపక్క సినిమాలు, మరో పక్క ఫ్యాషన్‌ షోలతో ఇలా అదరగోడుతోంది. లేటెస్ట్ గా ముంబాయిలో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో ఇలా ట్రెడిషనల్‌ గా చీరకట్టుకుని తాప్సీకి ఏమైంది అని అనిపించేడట్లుగా ఆమె ప్రవర్తిస్తోంది.  నుదుటన పేద్ద బొట్టుతో హడావిడి చేస్తూ తాప్సీ మారిపొయిందా అని అనిపించే డట్లుగా ఆమె చేసిన ర్యాంప్ వాక్ ప్రస్తుతం టాపిక్ ఆఫ్ బాలీవుడ్ గా మారింది. తాప్సీ లేటెస్ట్ అవతారాన్ని చూసి మన తెలుగు నిర్మాతలు ఎవరైనా అవకాశాలు ఇస్తారేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: