వెండి తెర పై బ్రహ్మనందాన్ని చూడగానే ఎన్నడు నవ్వని వ్యక్తి కూడ మనసారా నవ్వుతాడు. అది బ్రహ్మి గొప్పతనం. అందువల్లనే దశాబ్దాల పైగా బ్రహ్మిహవా కొనసాగుతోంది. ఆ మధ్య ఒక సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న బ్రహ్మానందo ఒక విచిత్రమైన మాట అన్నాడు.  ఈ జన్మలో తాను ఏ మంచి పని చేయలేదు కాబట్టి వచ్చే జన్మలో తాను జంతువుగా పుడతానని తన పై తాను సెటైర్లు వేసుకున్నాడు బ్రహ్మి. అంతేకాదు వచ్చే జన్మలో ఏ కుక్కగా పుట్టినా తన తోటి కుక్కలను నవ్విస్తానని అంటూ అందర్నీ ఆశ్చర్య పరిచాడు.  ఈ సంఘటన జరిగి కొన్ని రోజులు అయిపోయినా బ్రహ్మానందo తాను అన్నమాటకి కట్టుబడి ఉన్నాడు అనిపించేడట్లుగా ప్రస్తుతం వెబ్ మీడియాలో హాడావిడి చేస్తున్న ఒక ఫోటో అనేక అర్ధాలను కలుగు చేస్తోంది. బ్రహ్మనందం ఈ ఫోటోలో తను సోఫా మీద కూర్చుని తన పెంపుడు కుక్కతో ముఖంలో ముఖం పెట్టి ఎదో రహస్యం చెపుతున్న ఈ ఫోటో చాలామందిని ఆకర్షిస్తోంది.  అంతేకాదు నిర్మాతల దగ్గర భారీ పారితోషికాలను ముక్కు పిండి వసూలు చేసే బ్రహ్మి ఈ కుక్కతో ఏ రహస్యాలు మాట్ల్డాడుతున్నాడు అంటూ సెటైర్లు వేసుకునేలా బ్రహ్మనందం ఫోజు ఉంది. ఇంతకీ ఆ రహస్యాలు ఏమిటీ అన్నది ఆ సునక మహారాజుకే తెలియాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: