ఎల్లుండి విడుదల అవుతున్న ‘రభస’ విషయంలో జూనియర్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది అనే వార్తలు వస్తున్నాయి. ‘రభస’ టాక్ ఎలా వచ్చినా మహేష్ బాబు ‘వన్’ నేనొక్కడినే మొదటిరోజు కలెక్షన్స్ రికార్డులను బ్రేక్ చేద్దామని ఎన్టీఆర్ వేసుకున్న అంచనాలను కూడ ‘రభస’ సినిమా అందుకోలేక పోతోంది అనే వార్తలు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి. సంక్రాంతికి విడుదలైన ‘1’ నేనొక్కడినే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా ఏకంగా 1400 ధియేటర్లలో విడుదల కావడంతో మహేష్ కు ఉన్న క్రేజ్ రీత్యా ‘వన్’ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ లో మాత్రం దుమ్ము దులిపి రికార్డు క్రియేట్ చేసింది. ‘రభస’ ఫలితం ఎలా ఉన్నా ‘వన్’ సినిమా స్థాయికి మించి అత్యధిక ధియేటర్లలో విడుదల చేసి కనీసం మహేష్ బాబు మొదటిరోజు కలెక్షన్స్ రికార్డును అయినా బ్రేక్ చేద్దామని భావించాడు జూనియర్.  కాని ఈ విషయంలో కూడ జూనియర్ కు నిరాశ ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘రభస’ ఇరు రాష్ట్రాలలోని ఆంధ్రా, నైజాం, సీడెడ్ ప్రాంతాలలో సుమారు 800 ధియేటర్లలో విడుదల అవుతున్నట్లు టాక్. ఇది కాకుండా కర్నాటక, తమిళనాడు ప్రాంతాలను కలుపుకుని సుమారు ఒక 150 ధియేటర్లలో ‘రభస’ హడావిడి చేయబోతోందని అంటున్నారు. అమెరికాలో ఈ సినిమా విడుదల అవుతున్న 100 ధియేటర్లను కలుపుకున్న మొత్తం మీద ‘రభస’ హడావిడి 1200 ధియేటర్లు మించి ఉండదు అని అంటున్నారు. దీని వల్ల జూనియర్ సినిమాకు టాక్ ఎలా ఉన్నా మొదటిరోజు కలెక్షన్స్ మాత్రం ఎట్టి పరిస్తుతులలోను మహేష్ ‘వన్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డును దాట లేదని విశ్లేషకులు ఖచ్చితంగా చెపుతున్నారు. ఈ పరిస్తుతులతో పాటు ‘రభస’ పబ్లిసిటీ విషయంలో కూడ వెనక బడి ఉండడంతో మహేష్ రికార్డును బ్రేక్ చేద్దామనుకున్న జూనియర్ ఆశలు ‘రభస’ విడుదల కాకుండానే ఆవిరి అయ్యాయి అని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: