నరేంద్రమోడీ క్యాబినెట్ లో రైల్వేశాఖ మంత్రిగా ఉన్న కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ సదానంద గౌడ తనయుడు కార్తిక్ పై కన్నడ మోడల్ , నటి మైత్రేయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కార్తిక్ తనను పెళ్లిచేసుకొంటానని హామీ ఇచ్చి మోసం చేశాడని ఆమె ఆరోపిస్తోంది. పెళ్లి చేసుకొంటానన్న హామీతో కార్తీక్ తనను లైంగికంగా కూడా వాడుకొన్నాడని ఆమె అంటోంది. ఇప్పుడేమో తనతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నాడని దూరం అయ్యాడని ఆమె చెబుతోంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది మైత్రేయ. పెళ్లి చేసుకొంటానని హామీ ఇచ్చి శారీరకంగా వాడుకొన్న కార్తిక్ పై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కార్తీక్ పై సెక్షన్ 420 తో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మొత్తానికి ఈ ఫిర్యాదుతో భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నాడు సదానంద గౌడ. మరి ఆయన తనయుడు ఈ విధంగా ఒక అమ్మాయిని మోసం చేశాడనే ఆరో పణలు ఎదుర్కోవడం, ఆ వ్యవహారం పోలీసుల వరకూ వెళ్లడం బీజేపీ కి చెడ్డ పేరును తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే రాజ్ నాథ్ సింగ్ తనయుడి వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. మరి దానికి తోడు ఇప్పుడు మరో క్యాబినెట్ మినిస్టర్ తనయుడిపై ఈ విధమైన ఆరోపణలు వినిపించడం ఆసక్తికరమైన అంశం. మరి ఇలా తనయుల వల్ల వచ్చే ఇబ్బందులను బీజేపీ నేతలు ఎదుర్కొంటారో!

మరింత సమాచారం తెలుసుకోండి: