ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ పూనమ్ పాండే దెబ్బకు అదిరిపోయి ఆమె ఫేస్ బుక్ ఖాతాను తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె వ్యక్తిగత ఫేస్ బుక్ పేజీలో రోజురోజుకు పెరిగి పోతున్న అశ్లీల ఫోటోల హడావిడితో రిమ్మతిరిగి పోయిన ఫేస్ బుక్ యాజమాన్యం ఈ చర్యకు పాలుపడినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.  హాట్ సెలెబ్రెటీగా ట్విటర్ లలో తన హాట్ హాట్ ఫోటోలు రెచ్చ గొట్టే వీడియోలతో ఆమె నిరంతరం సందడి చేస్తూ ప్రతిరోజు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు పూనమ్ తన పేజీని ఫేస్ బుక్ నుండి తొలగించడం పై అనుకోని షాక్ కు గురైందని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఆమెకు వెబ్ మీడియాలో ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘నా ఫేస్ బుక్ పేజీ తొలగించడం చాలా బాధగా ఉంది. ఏమిచేస్తే నా ఫేస్ బుక్ అకౌంట్ మళ్లీ వెనక్కి వస్తుందో చెప్పండి' అంటూ ట్విట్టర్ ద్వారా అడుగుతోంది పూనమ్. పూనమ్ పాండే ఫేస్ బుక్ పేజీ తొలగింపుపై ఆమె అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే వెబ్ మీడియాలో పూనమ్ అర్ధనగ్న ఫ్రీ షోలను భరించ లేకపోతున్నవారు మాత్రం మళ్ళీ పూనమ్ ను ఫేస్ బుక్ యాజమాన్యం క్షమించి మరొక అవకాసం ఇవ్వకుండా ఉంటె సమాజానికి మంచి సంకేతాలు అందుతాయని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: