పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే వారం సెప్టెంబర్ 2న విడుదల కాబోతున్న ‘గోపాలా గోపాలా’ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుంది అన్న ఆతృత పవన్ అభిమానులలో విపరీతంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థుతులు ఇలా ఉండగా పవన్ గోపాలుడి ఫస్ట్ లుక్ కు సంబంధించి కొన్ని ఆ శక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ మోడరన్ కృష్ణుడిగా నల్ల టీ షర్టు పై నల్లకోటు ధరించి నల్ల కళ్ళ అద్దాలతో స్టైల్ గా పవన్ నడుస్తున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేయబోతున్నారని ఫిలింనగర్ లో వార్తల హడావిడి జరుగుతోంది. కృష్ణుడుని నల్లనయ్యా అని పిలుస్తూ ఉంటారు కాబట్టి పవన్ గోపాలుడి గెటప్ కు ఇలా నల్ల కోటు నల్ల టీ షర్టు ఈ సినిమా యూనిట్ ఎంచుకున్నారు అని టాక్. ఇప్పటికే ఈ సినిమాలో పవన్ తన ‘అత్తారింటి దారేది’ సినిమాలోని హెయిర్ స్టైల్ లో కనిప్స్తాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ నల్ల కోటు నల్ల టీషర్టు కధనం పవన్ గోపాలుడి ఫస్ట్ లుక్ పై మరింత ఆశక్తిని పెంచేస్తున్నాయి. బిజినెస్ పరంగా ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా పవన్ ఫాస్ట్ లుక్ విడుదల తరువాత మరింత సంచలనాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: