సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నిర్మింప పడుతున్న లింగా మూవీ ఫస్ట్ లుక్ నిన్న వినాయక చవితి రోజున విడుదల అయింది. ఈ సినిమాలో రజనీకాంత్ ను ఎంత స్టైలిష్‌గా చూపించబోతున్నారో ఈ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది. తమ అభిమాన హీరో రజనీకాంత్ తాము కోరుకున్న విధంగా స్టైలిష్ గా కనిపిస్తూ ఉండటంతో రజని అభిమానులు నిజమైన పండుగ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ తరువాత ఈ సినిమా పై మరింత అంచనాలు పెరిగి పోతున్నాయి అంటూ కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం దొంగగా, ఇంజినీరు గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. చాలాకాలం తరువాత రజనీ మాస్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమాలో స్వాతంత్య్రం ముందు, ఆ తర్వాత తరాలకు చెందిన రెండు పాత్రల్లో రజనీకాంత్‌ కనిపించ బోతున్నాడు.  అనుష్క, సోనాక్షి లతో మొట్టమొదటి సారి రజని నటిస్తున్న ఈ సినిమా రజనీకాంత్ పుట్టిన రోజున విడుదల కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లోనే చిత్రీకరించడం ఒక విశేషం. అయితే రజనీకాంత్ కెరియర్లో అతి తక్కువ రోజులలో నిర్మిప పడ్డ సినిమాగా ‘లింగా’ రికార్డుకు ఎక్కబోతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: