మొన్నటి వరకు రాజకీయ నాయకులనే కాదు దేవుళ్ళు, దేవతల పై సెటైర్లు వేసిన వర్మకు నిన్న జరిగిన వినాయక చవితి రోజు నుంచి జ్ఞానోదయం అయిందా అని అనిపిస్తోంది. దీనికి కారణం వర్మ లేటెస్ట్ గా పెడుతున్న ట్విట్స్ పరిశీలిస్తున్న వారు చెపుతున్న వ్యాఖ్యలే కారణం. రాంగోపాల్ వర్మ నాస్తికుడు నుండి ఆస్తికుడిగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అంటూ కామేట్లు వినపడుతున్నాయి. దేవుడి కంటే దయ్యాలే మంచివని వాదించే వర్మ ప్రస్తుతం భగవంతుడిని నమ్ముకునే ప్రయత్నం చేస్తున్నట్టు తాజా ట్వీట్ తో అర్ధమవుతోంది. నా చిత్రాలు పరాజయం పొందడానికి కారణం దేవుళ్లను దూషించడమే కారణమనిపిస్తుంది. ఇక భక్తుడిగా మారాలనుకుంటున్నాను అంటూ వెరైటీ ట్వీట్ చేశాడు వర్మ.  కొంతకాలం క్రితం ఈ సంచలన దర్శకుడు దేవుడు మంచి వాడైతే మెదక్ లో జరిగిన రైల్వేగేట్ ప్రమాదంలో చిన్నారులను ఎందుకు పొట్టన పెట్టుకుంటాడు అంటూ వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం లక్ష్మి, సరస్వతులను బ్యాడ్ గాడ్స్ అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా ఏకంగా శివుడి పై సెటైర్లు వేసి సమస్యలలో చిక్కుకున్న వర్మకు ఈ జ్ఞానోదయాన్ని వినాయకుడు ఎందుకు కలిగించాడో ఆయనకే తెలియాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: