మెగాస్టార్ చిరంజీవి పై అక్కినేని నాగార్జున కామెంట్ విసిరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి రి ఎంట్రి ఇస్తున్నారు. దీంతో చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా టాలీవుడ్ రికార్డ్స్ ని షేక్ చేసే విధంగా చిరంజీవి 150 వ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే తమ నటనతో తమ కంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున. ఇటీవలే ఈ ఇద్దరు హీరోలు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే ప్రోగ్రాం లో బుల్లితెరపై కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జునని చిరుతో మల్టీ స్టారర్ సినిమా ఎప్పుడు చేస్తారని అడిగితే ‘ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో కలిసి ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. కానీ మంచి కథ దొరక లేదు. కానీ చిరు 150వ సినిమా సోలోగానే చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత మంచి కథ దొరికితే మేమిద్దరం కలిసి సినిమా చేస్తాం’ అని అన్నాడు. అయితే నాగార్జున మాత్రం చిరంజీవితో ఓ మూవీని చేయటానికి సిద్ధంగా ఉండటమే కాకుండా, ఇప్పటికే పలు కథలను సైతం విన్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవి కూడ నాగార్జునతో కలిసి మూవీని చేయటానికి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. దీంతో మొత్తంగా త్వరలోనే ఓ భారీ మల్టీస్టారర్ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: