టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ రభస. రభస మూవీకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా వినిపిస్తుంది. ఎందుకంటే రభస మూవీ హిట్ అనేది జూనియర్ ఎన్టీఆర్ కి సైతం కీలకంగా మారనుంది. రభస మూవీ బాక్సాపీస్ వద్ద సక్సెస్ సాధిస్తే, జూనియర్ మార్కెట్ టాలీవుడ్ లో మంచి స్థానంలో ఉంటుంది. అందుకే మూవీకి ఎంత లేటు అయినా, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను చాలా క్వాలిటీతో తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే రభస మూవీ మొదటి రోజు కలెక్షన్స్ కూడ బాక్సాపీస్ వద్ద హైలెట్ గా నిలుస్తున్నాయి. జూనియర్ నటించిన గత చిత్రాల కంటే రభస మూవీ మొదటి రోజు కలెక్షన్స్ కేక పుట్టించాయి. దమ్ము, రామయ్య వస్తాయ్య, బాద్ షా మూవీల కంటే రభస మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఎక్కువుగా వచ్చాయి. వినాయక చవితి సందర్భంగా రిలీజ్ అయిన రభస మూవీ, మొదటి రోజు కలెక్షన్స్ దాదాపు 8.85 కోట్ల రూపాయలుగా లెక్క తేలింది. ఓ రకంగా చూసుకుంటే ఈ మూవీ కలెక్షన్స్ ఓ వైపు మెగా హీరో రామ్ చరణ్ నటించిన నాయక్ మొదటి రోజు కలెక్షన్స్ , అలాగే మహేష్ బాబు నటించిన నేనొక్కడినే మూవీ మొదటి రోజు కలెక్షన్స్ కంటే కూడ రభస మూవీ కలెక్షన్స్ ఎక్కువుగా వచ్చాయి. మొత్తానికి రభస మూవీ బాక్సాపీస్ వద్ద దుమ్ములేపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: