సామాన్యంగా రచయితలు దర్శకులు తమ పై వచ్చే కాపి గాసిప్స్ గురించి స్పందించరు. కాని రాజమౌళి ఈ కాపీ గాసిప్స్ పై స్పందిస్తూ తనే స్వయంగా తన కామెంట్స్ తన ట్విటర్ లో పెట్టడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. తాను చాలా సినిమాలు, నవలల నుండి సీన్లు కాపి చేసాను కానీ ‘విక్రమార్కుడు' సినిమాలోని బుల్లెట్స్ సీన్ మాత్రం కాపీ చేయలేదు అంటూ వెరైటీ ట్విట్ చేసాడు రాజమౌళి. అంతేకాదు ఈ సీన్ చాలాకాలం క్రితమే తన తండ్రి రాసారని ఆసీన్ ను తాను శాంభవి ఐపీఎస్ చిత్రం నుండి కాపీ చేసాననే మాటలలో నిజం లేదని రాజమౌళి వెల్లడించారు. అంతేకాదు తన సినిమాల పై కాపీ గాసిప్పులు ప్రచారం చేసే వారి కోసం భయపడి తాను ఈ వివరణ ఇవ్వడంలేదు అని అంటూ తనను నమ్మే వారి కోసమే ఈ వివరణ ఇస్తున్నానని స్పష్టత ఇచ్చాడు రాజమౌళి. అయితే ‘విక్రమార్కుడు’ సినిమా సీన్ కాపీ పై వివరణ ఇచ్చిన రాజమౌళి ప్రస్తుతం తాను నిర్మిస్తున్న 180 కోట్ల సినిమా ‘బాహుబలి’ పై వస్తున్న కాపీ రూమర్ల పై మాట్లాడక పోవడం ఆశ్చర్యకరం. ఎంతైన రాజమౌళి స్పెషాలిటి అదే. 

మరింత సమాచారం తెలుసుకోండి: