గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నో సినిమాలలో ఎన్నో వెరైటీ పాత్రలు పోషించిన బాలకృష్ణకు నిజజీవితంలో తాతగా మారాలని ఎదురు చూస్తున్నానని అయితే అది తన చేతులలో లేదని తన పిల్లల చేతిలో ఉంది అంటూ తన పెల్లల పైనే సెటైర్లు వేసాడు బాలయ్య. అయితే తన పిల్లల ప్లానింగ్ బట్టి తనకు ఎప్పుడు మనవలు, మనవరాళ్ళు వస్తే వారితో ఆదుకోవాలని ఎదురు చూస్తున్నానని తనకు తాత ప్రమోషన్ వచ్చే రోజుల కోసం ఆశతో చూస్తున్నానని కామెంట్ చేసాడు బాలకృష్ణ. ఈరోజు ఒక ప్రముఖ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసాడు బాలయ్య. ఇదే సందర్భంలో తన కొడుకు మోక్షజ్ఞ గురించి మాట్లాడుతూ అతడికి సినిమాలంటే విపరీతమైన పిచ్చి అని, ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న తన కొడుకు హీరో కావడానికి మరో మూడేళ్ళు పడుతుందని చెపుతూ తన కొడుకు పై తను చాల ఆశలు పెట్టుకున్నాను అని చెపుతున్నాడు బాలయ్య. తన తల్లి పేరు, తన తండ్రి పేరు కలిసి వచ్చేలా తన కొడుకుకు తారకరామ తేజ మోక్షజ్ఞ అనే పేరు పెట్టుకున్నానని చెపుతూ మోక్షజ్ఞ అసలు పేరు బయట పెట్టాడు. ఇక తన డ్రీమ్ మూవీ ‘నర్తనశాల’ గురించి మాట్లాడుతూ తన వద్ద స్క్రిప్ట్ తో సహా అన్నీ సిద్ధంగా ఉన్నా ద్రౌపది దొరకక సినిమా ఆలస్యం అవుతోంది అని చెపుతూ ఈ తరం ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమాను తాను ఖచ్చితంగా తీస్తాను అని చెపుతున్నాడు బాలకృష్ణ. తానేది ప్లాన్ చేయనని భగవంతుడు ఏమి నిర్ణయిస్తే అదే జరుగుతుంది అనే వేదాంతం చెపుతున్నాడు బాలయ్య.  

మరింత సమాచారం తెలుసుకోండి: