1975 - 90ల మధ్య దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగులో విడుదలైన ప్రతి సినిమాలోను జయమాలిని ఐటమ్ సాంగ్ లేకుండా ఉండేదికాదు అంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్‌గా దాదాపు 500 సినిమాల్లో నటించడమే కాకుండా ఆ రోజులలోని టాప్ హీరోలందరితోను జయమాలిని స్టెప్పులు వేసింది.  అటువంటి జయమాలిని పెళ్ళి చేసుకుని సినిమాలకు దూరమైన 22 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇన్నాళ్లకు హైదరాబాదులో జరిగిన ఒక పత్రిక అవార్డుల ఫంక్షన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారడమే కాకుండా ఒక పాటకు స్టెప్స్ వేసి జనాన్ని అదరగొట్టింది. మొన్న శనివారం రాత్రి భాగ్యనగరంలో జరిగిన ‘సంతోషం’ అవార్డ్స్ నైట్ లో జయమాలినిని చూసిన చాలామంది అతిధులు ఆమెను ప్రేమగా అభిమానంతో పలకరించడమే కాకుండా ఆమె స్టేజ్ ఫై ‘ఓ సుబ్బారావు ఓ వెంకట్రావు’ పాటకు స్టెప్స్ వేస్తుంటే పెద్ద వాళ్ళు అందరు యూత్ లా మారిపోయి చప్పట్లు కొట్టారు.  ఇదే ఫంక్షన్ కు అతిధులుగా వచ్చిన చిరంజీవి, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, బ్రహ్మానందం, షావుకారు జానకి, కృష్ణకుమారి, అంబిక, విజయనిర్మల తదితరులను జయమాలిని ఆప్యాయంగా పలకరించడం సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ కు హైలెట్ గా మారింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: