రంగుల ప్రపంచంలో కారుమబ్బులు కమ్ముకుంటున్నాయ్. రియల్ లైఫ్ కూడా రీల్ లైఫ్ లా మారుతోంది. సినిమాల్లోని క్యారెక్టర్ మాదిరిగానే జీవితానికి కొత్త పాత్రలు ఆపాదించుకొని.. కొందరు తారలు వ్యభిచార రొంపిలో దిగిపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో వర్ధమాన తారలు వ్యభిచారం చేస్తూ పోలీసులుకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కుతున్నారు. సైరాభాను, జ్యోతికలు ఎపిసోడ్ మర్చిపోకుండానే.. తాజాగా శ్వేతబస్సు బుక్కయింది. సినిమాల్లో అవకాశాలు లేక.. వ్యభిచారంలోకి పూర్తిస్థాయిలో దిగిపోయారు.. ఒంపుసొంపులతో సినిమాల్లో కనువిందు చేసే స్టారర్స్.. చివరకు తన దేహాల్నే అమ్మకానికి పెట్టి అభాసు పాలవుతున్నారు. పలువురు తారలు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం సినిమా ఇండస్ట్రీ కీర్తిని మసకబారేలా చేస్తోంది. సైరాభాను, జ్యోతి, శ్వేతబసు.. ఇలా సినీ ఆర్టిస్టులకు ప్రాస్టిట్యూట్స్ అన్న ముద్ర పడిపోతోంది. తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతున్న చీకటివ్యవహారాలకు ఈ అరెస్టులు ఓ నిదర్శనం. అడపా దడపా ఎవరో ఒకరు ఇలా రైడ్స్‌లో పట్టుబడుతున్నప్పటికీ, అయితే చట్ట ప్రకారం మహిళలను బాధితులుగానే పరిగణించి వదిలివేస్తారు కాబట్టి.. వీరికీ మోక్షం దొరుకుతుంది. సినీ రంగుల ప్రపంచంలో హంగూ ఆర్భాటాలతో కనిపిస్తే తప్ప రోజు గడవదు. అలా ఉండాలంటే ఎంతో డబ్బు కావాలి. అలవోకగా ఖర్చుపెట్టగలాలి. సినీ ఆఫర్లు లేవు కాబట్టి.. తక్కువ టైంలో ఎక్కువ సంపాదించుకునే అవకాశం కోసం ఆర్టిస్టులు వెతుక్కుంటారు. అక్కడే వ్యభిచారంవైపు మనసు మళ్లిస్తారు. సంపాదన కోసం తప్పు చేసినా పర్వాలేదనే స్థితికి చేరుకుంటారు. సాధారణ సెక్స్‌వర్కర్ల కన్నా ఈ సినీ వ్యభిచారులు వసూలు చేసేది చాలా ఎక్కువే. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోవడం, కొన్ని గంటల్లోనే వేలకు వేలు సంపాదించే అవకాశం ఉండడం, చిన్న చిన్న ఆర్టిస్టులను ఈ రొంపిలోకి దిగేలా చేస్తున్నాయి. ఇప్పుడు దొరికింది ఇలా కొందరే అయినా ఇలా జీవితాలను వ్యభిచారం పాలు చేస్తున్న ఆర్టిస్టులు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ఉన్నారు. అవకాశాలు లేక కొంతమంది, జల్సాల కోసం మరికొంతమంది ప్రాస్టిట్యూట్స్‌గా మారుతున్నారు. రోజురోజుకూ ఇది పెరుగుతోందే తప్ప.. కంట్రోల్ అయ్యే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఎంతోమంది ఆర్టిస్టులు.. తెరపై కనిపిస్తూ కవ్విస్తారు. వలపు వలను జనంపైకి విసిరేవారితోనే సమస్య. ఇండస్ట్రీలో ఇమేజ్‌ను పెట్టుబడిగా పెట్టి.. సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తూ కొంతకాలం క్రితం పోలీసులకు దొరికిపోయింది సినీనటి భువనేశ్వరి. తమిళ, తెలుగు భాషల్లో వ్యాంప్ క్యారెక్టర్లలో ఎక్కువగా కనిపించే భువనేశ్వరి పెద్ద ఎత్తునే సెక్స్‌ట్రేడ్ నిర్వహించింది. అవకాశాల కోసం ఇండస్ట్రీ గడప తొక్కే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ఈ ఊబిలోకి దింపింది. తెరపై చేసేవి చిన్న చిన్న క్యారెక్టర్లే అయినా.. తెరవెనుక మాత్రం ఇలా ఓ కాస్ట్‌లీ ప్రాస్టిట్యూట్స్ బృందానికి లీడర్ అయ్యింది. ఇక తెలుగు ఇండస్ట్రీకి వస్తే సకుటంబ సపరివార సమేతంగా, కుంకుమ, మధుమాసం, హీరో, భాగ్యలక్ష్మి బంపర్‌డ్రా ఇలా చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన విజయలక్ష్మి అలియాస్ సీమా కూడా జనవరి, 2009 లో పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిపోయింది. ప్రముఖ నటి యమున వ్యభిచారం చేస్తూ పట్టుబడడం అందరినీ నివ్వెరపరిచింది. బెంగళూర్‌లోని ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ ఆమెతో పాటు వర్ధమాన నటి సురక్ష కూడా పట్టుబడింది. అప్పట్లో ఆమె నటనకు చాలా మంది మురిసిపోయారు. తమ అభిమాన నటి వ్యభిచారం చేస్తూ పట్టుబడడం తెలుగు ప్రజలకు మింగుడు పడలేదు. ఖాకీల కన్ను ఎక్కడ..? తాజాగా శ్వేత బసు కథలోకి ఎంటరైతే.. బంజారహిల్స్ లో ఉండే పార్క్ హయత్ హోటల్ కు వెళ్లాలంటే స్టాటస్ సింబల్ కంపల్సరీ.. అందులోకి వెళ్లాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు.. అది ఓ బడా పారిశ్రామికవేత్తది.. అలాంటి హోటల్లో శ్వేతాబసు హీరోయిన్ కు ఎంట్రీ పాస్ దొరికింది.. ఆ దందా నడిపేందుకు ఓ మేనేజర్ బాలు.. రంగంలోకి దిగాడు.. ఇలా కొన్నాళ్ల పాటు శ్వేతబసు బిజినెస్ కు మూడు పువ్వులు ఆరుకాయలుగా విరజిల్లుతుంది. హోటల్లోకి ఓ పారిశ్రామిక వేత్త వెళ్లి పనిచేసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు లక్ష రూపాయలు ఇచ్చి శ్వేత బసును రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. కాని బంజారాహిల్స్ లో పార్క్ హయత్ హోటల్లో ఒక్క శ్వేతాబసు మాత్రమే పోలీసులకు కనబడిందా..? ఇంకా ఇలాంటి తారల కథలు ఇంకెన్నో ఉన్నా వారికెందుకు కనబడట్లేదు.. స్టార్ల జోలికి ఖాకీలు కనుచూపుమేర కూడా వెళ్లరనే ఆరోపణలున్నాయి.. బంజారహిల్స్ లో స్టార్ హోటల్స్ ఉన్నాయి.. వాటిలో జరిగే చీకటి కోణాలు బంజారహిల్స్ పోలీసుల నజర్ కు చిక్కదు.. పార్క్ హయత్ హోటల్ అంటేనే బంజారాహిల్స్ పోలీసులకు భయమెందుకో మరి. తారల వెనుక చీకటి కోణాలు ఇలా ఉంటే.. ఈ తరాల కాస్ట్ లీ ప్రాస్టి ట్యూట్స్ ను బృందాలకు కొంతమంది మాఫియా దందాను నడిపే బడా బాబులుంటారు. కాని వీళ్ళు పోలీసులకు చిక్కరు...వారి లెక్కలు వారికుంటాయి... నెల నెలా పోలీసుల వాటా పోలీసులకు అందాల్సిందే.. లేకుంటే.. రైడింగ్ ల అవతారంలో ఒంటికాలిపై లేచే కాకీలు ఎందరో ఉన్నారు.. బడాబాబుల స్టార్ హోటల్లో పేకాటా ఆడినా.. స్టార్ హీరోయిన్లతో సయ్యాట ఆడినా వీళ్ల కళ్లకు కనబడదనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: