మాస్ మహారాజ్ రవితేజ నటించిన అప్ కమింగ్ మూవీ పవర్. పవర్ మూవీకి సంబంధించిన విడుదలపై జాప్యం జరుగుతుంది. ఈ మూవీని ఈ వారంలో రిలీజ్ చేయాలని మొదటగా నిర్మాతలు భావించినప్పటికీ, కొన్ని కారణాలతో మూవీ విడుదల మరో రెండు వారలు వెనక్కి వెళ్ళింది. దీంతో రవితేజా నటించిన పవర్ మూవీ, థియోటర్స్ ని హిట్ చేయటానికి మరి కొంత ఆలస్యం కానుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హన్సిక హీరోయిన్. రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కనిపించనున్నాడు. రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రానికి నిర్మాత. ఇప్పటి వరకూ రవితేజ నటించిన చిత్రాలలో ఇది చాలా డిఫ్రెంట్ లుక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రవితేజ చెప్పుకొచ్చాడు. రవితేజ ఈ మూవీపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. ఈ విడుదలకు కారణం ఏంటో తెలుసుకుంటే సెన్సార్ పనులలో జాప్యం వలన విడుదల వాయిదాపడినట్టు సమాచారం. గత వారమే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సి మూవీ, కొన్ని కారణాలతో ఆలస్యం కావడంతో, మూవీ విడుదలను పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో రవితేజ నటించిన పవర్ మూవీ ఏ విధంగా ఉంటుందో చూడాలనుకునే అభిమానులు మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. రవితేజ పవర్ మూవీ అనంతరం కిక్2 మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: