తెలుగు అక్షరాలకు చిరునామాగా తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న మహా దర్శకుడు బాపు గురించి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాతో షేర్ చేసుకున్న విషయాలు అత్యంత ఆశక్తి దాయకంగా ఉన్నాయి.  బాపు నిర్మించిన ‘శ్రీరామరాజ్యం’ చిత్రాన్ని పవన్ ప్రసాద్ ల్యాబ్ లో తనకోసం ప్రత్యేకంగా ఒక రాత్రి పూట వేయించుకుని చూసి ఆ సినిమాలోని సన్ని వేసాలకు చలించిపోయి పవన్ తన కంట కన్నీరు పెట్టడమే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఆ సినిమా చూసిననాటి రాత్రి 12 గంటల సమయంలో పవన్ త్రివిక్రమ్ కు ఫోన్ చేసి ఒణుకుతున్న తన గొంతుకతో దాదాపు అర గంట సేపు బాపు గొప్ప తనం గురించి త్రివిక్రమ్ తో ఏకధాటిగా మాట్లాడి త్రివిక్రమ్ ను ఆశ్చర్య పరిచాడట.  ఈ సంఘటన జరిగి చాలకాలం అయినా పవన్ ఒక సినిమా గురించి అంత భావోద్వేగంతో మాట్లాడటం తాను ఇంతవరకు చూడలేదు అంటున్నాడు త్రివిక్రమ్. బాపు గురించి ఈ మాటల మాంత్రికుడు మాట్లాడుతూ ఏదైనా అనుకుంటే, వెంటనే చేసేయాలి అంతే తప్ప ఆలస్యం అస్సలు ఉండకూడదు అంటూ బాపు గారికి అనారోగ్యంగా ఉందని తెలిసినప్పటి నుంచి స్వయంగా వెళ్ళి కలవాలని అనుకుంటూ ఉన్నా వెళ్లి కలవక ముందే ఆయన పై లోకాలకు వెళ్ళిపోవడం తనను విపరీతంగా కలవర పెడుతోంది అంటూ త్రివిక్రమ్ కన్నీటి పర్యంతం అయ్యారు.  పుట్టిన ప్రతి ఒక్కరికీ మరణం సహజమని తెలిసినప్పటికీ బాపు, రమణల లాంటి వ్యక్తులు వంద ఏళ్ళు కాదు నూట పాతికేళ్ళు బతకాలని కోరుకున్నా భగవంతుడు ఆ కోరిక తీర్చడని వేదాంత రీతిలో మాట్లాడాడు త్రివిక్రమ్. ఏది ఏమైనా ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోడు అని పేరున్న పవన్ కళ్యాణ్ కంటి వెంట కన్నీరు పెట్టించిన ఘనత కూడ బాపూకే దక్కింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: