ఎన్నో సంచలనాలకు మారు పేరైన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పేరు మీద ఒక సెటైరికల్ సినిమా రాబోతోంది ఈ సినిమా పేరు ‘ఎ శ్యాం గోపాల్ వర్మ’. చేసినవి తక్కువ సినిమాలే అయినా మంచి నటుడిగా పేరున్నషఫి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు.  రక్తపాతాలు, హింస సన్నివేశాలతో సినిమాలు తీసే ఓ దర్శకుడు చివరికి ఎలాంటి ఫలితాలు అనుభవించాడు అనే కధాంశంతో ఈ సినిమాను రూపొందించామని ఈ సినిమా దర్శక నిర్మాతలు చెపుతున్నారు. ఈ సినిమా టీజర్ నిన్న విడుదల చేసారు. వాస్తవిక పాత్రలను ప్రతిబింబిoచే సినిమా ఇది అని అంటున్నారు ఈ సినిమా యూనిట్ సభ్యులు.  ఈ వార్తలు ఇలా ఉండగా దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద రూ.5 కోట్ల చీటింగ్ కేసు నమోదు అయినట్లుగా మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. ముంబైలోని ఒక నిర్మాణ సంస్థ వర్మ తమ దగ్గర తీసుకున్న 5కోట్ల రూపాయలను తిరిగి చెల్లించకుండా తమను చీట్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. వర్మ నిర్మించిన సత్య-2 సినిమా షూటింగ్ సందర్భంగా వర్మ ఈ డబ్బును తమ దగ్గర తీసుకున్నాడని ఈ సంస్థ ప్రతినిధులు ఆరోపిస్తున్నట్లు టాక్. దేవుళ్ళ పై సెటైర్లు వేసినందుకు కేసుల ఉచ్చులో చిక్కుకుని, ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్తలను బట్టి వర్మ పీకలలోతు కష్టాలలో ఉన్నాడు అనుకోవాలి. ఈ వార్తల నేపధ్యంలో వర్మ కామెంట్స్ మాత్రమే కాదు వర్మ పేరుతో నిర్మిస్తున్న సినిమాలు కూడ సంచలనంగా మారుతున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: