నిన్న పవన్ అందుబాటులో లేకపోయినా ఇరు రాష్ట్రాలలోను పవన్ అభిమానులు పవర్ స్టార్ పుట్టిన రోజు వేడుకలను అత్యంత కోలాహలంగా ప్రతి ఊరులోను జరిగాయి. రాజకీయ నాయకుల దగ్గర నుంచి సామాన్య అభిమానుల వరకు పుట్టినరోజు సందర్భంగా కేక్స్ కట్ చేస్తూ హడావిడి చేసారు. ఈ హడవిడిలో పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ పవన్ అభిమానులు ఆనందపడే ఒక షాకింగ్ న్యూస్ ను తన ట్విటర్ లో పెట్టింది.  'ఇష్క్ వాలా లవ్ చిత్రంలో అకిరా అతిథి పాత్రలో నటిస్తున్నాడు. నేను దర్శకత్వం వహించి, నిర్మిస్తున్న చిత్రంలో అకిరా వెండితెరకు పరిచయం కావడం తల్లిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది' అని రేణు ట్వీట్ చేసింది. మొదటి నుంచి రేణు పవన్ పుట్టినరోజునాడు పవర్ స్టార్ అభిమానుల కోసం ఒక ఊహించని బహుమతి ఇస్తాను అని చెపుతూ ఉన్నా అది ఆమె దర్శకత్వం వహిస్తున్న ‘ఇష్క్ వాలా లవ్' సినిమా ట్రైలర్ అనుకున్నారు. కాని పవన్ కొడుకు అకిరా నందన్ కు సంబంధించిన న్యూస్ అనుకోలేదు. పవన్ పుట్టినరోజునాడు ఈ సినిమాకు సంబంధించిన మరాఠీ ట్రైలర్ విడుదల చేసిన రేణు త్వరలో ఈ సినిమాకు సంబంధించిన తెలుగు డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమా ట్రైలర్ తెలుగులో కూడా విడుదల చేయబోతోంది రేణు. తెలుగు ట్రైలర్ లో పవన్ కొడుకు అకిరా నందన్ కనిపిస్తే ఈ సినిమాకు తెలుగులో కూడ క్రేజ్ పెరగడమే కాకుండా భారీ సినిమాల స్థాయిలో ఈ సినిమాకు కూడ ఓపెనింగ్స్ వస్తాయి అన్నది వాస్తవం. రేణు ఎత్తుగడ ఎలా ఉన్నా వెండి తెరపై జూనియర్ పవర్ స్టార్ ను చూసే అవకాశం రేణుదేశాయ్ అందిస్తున్నందుకు పవన్ అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: