అక్కినేని క్రేజ్ ను జనం మధ్య కొనసాగించడానికి నాగార్జున రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. అక్కినేని సూపర్ హిట్ సాంగ్స్ ను సినిమా టైటిల్ గా మార్చుకుని ‘ఒక లైలా కోసం’ అంటూ చైతన్య రెడీగా ఉంటే చైతూ చేస్తున్న ప్రయత్నాలకు తన వంతు సహాయం చేస్తూ నాగార్జున కూడ తన తండ్రి సూపర్ హిట్ పాటలనే నమ్ముకుని రంగంలోకి దిగుతున్నాడు.  అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ఆస్తిపరులు’ సినిమాలోని ‘సోగ్గాడే చిన్ని నాయనా, ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు’ అంటూ వచ్చే పాట ఆ రోజులలోనే కాదు ఈ రోజులలో కూడ సూపర్ హిట్. ఒకనాటి హీరోయిన్ వాణిశ్రీ జగ్గయ్యను ఏడిపిస్తూ ‘ఆస్తిపరులు’ సినిమా కోసం చిత్రీకరించిన పాట ఇది.  ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోతో మంచి క్రేజ్ మీద ఉన్న నాగార్జున కళ్యాణ్ కృష్ణ అనే కొత్త దర్శకుడితో నిర్మిస్తున్న  సినిమాకు తన తండ్రి పాటను టైటిల్ గా ఎంచుకుని ‘సోగ్గాడే చిన్ని నాయన’ గా వస్తున్నాడు. నాగార్జున చాలాకాలం తరువాత ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా గ్రామీణ నేపధ్యంలో ఉంటుంది.  నాగ్ ఈ సినిమాలో పంచ కట్టుతో కనిపిస్తాడట. రమ్యకృష్ణ కూడ ఈ సినిమాలో నాగార్జున పోషిస్తున్న అన్న పాత్రకు భార్యగా చేయబోతోంది. ఈ మూవీ గతంలో అక్కినేని నటించిన ఒక సూపర్ హిట్ మూవీకి ప్రీమేక్ అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: