కొన్ని సంవత్సరాల క్రితం యూత్ ని తమ అభిమాన సంగీత దర్శకుడు ఎవరు అని అడిగితే ఒక్కక్షణం కూడ ఆలోచించ కుండా ఆర్ పి పేరు చెప్పేవారు. ఆ తరువాత సంగీత దర్శకుడిగా తన ప్రాభవాన్ని కోల్పోయిన ఆర్ పి పట్నాయక్ దర్శకుడిగా, నటుడిగా రాణించదానికి చాల ప్రయత్నాలు చేసాడు.  ఆర్ పి నటించిన ‘బ్రోకర్’ లాంటి సినిమాలు విమర్శకుల దగ్గర నుంచి ప్రశంసలు తెచ్చి పెట్టాయి కాని కాసులు కురిపించ లేదు. దీనితో విసిగి పోయిన ఆర్ పి తన అదృష్టాన్ని కన్నడ సినిమా రంగంలో పరీక్షించుకోవడానికి సిద్ద పడుతున్నాడు. దీనిలో భాగంగానే కన్నడ ప్రేక్షకులకు నచ్చే కధతో ‘వ్యూహ’ అనే సినిమాను తీసాను అని అంటున్నాడు. ఈ సినిమాలో ప్రస్తుతం టాలీవుడ్ లోను కోలీవుడ్ లోను అవకాశాలు లేని ప్రియమణిని పోలీసు ఆఫీసర్ గా చూపెట్ట బోతున్నాడు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకున్నా అదృష్టం కలిసిరాని ప్రియమణి, రాష్ట్ర స్థాయిలో నంది అవార్డును అందుకున్న అవకాశాలు లేని ఆర్ పి వీరిద్దరూ చేస్తున్న కన్నడ ప్రయోగం విజయవంతం అయితే వీరిరువురి కెరియర్ కు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు అయ్యే అవకాసం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: