బాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ దీపికా పదుకోన్ తన మాటల వేడి పెంచిది. రెండు రోజుల క్రితం శ్వేతబసు విషయంలో ఆమెకు సపోర్ట్ ఇస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృస్టించిన విషయం చల్లారకుండానే లేటెస్ట్ గా ఒక ఇంగ్లీష్ దినపత్రిక పై విరుచుకపడింది దీపిక.  అంతేకాదు తాను ఆడదానినని, తనకూస్తన సంపద ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించడమే కాకుండా మీకేమైనా అభ్యంతరమా అని ఆ పత్రికను తన ట్విటర్ ద్వారా ఘాటుగా ప్రశ్నించిoది దీపిక. తన వస్త్రధారణపై ఆ ప్రముఖ దినపత్రిక రాసిన కథనం మీద మండిపడిన దీపిక మహిళా సాధికారత గురించి మాట్లాడే పత్రికలకు మహిళలను ఎలా గౌరవించాలో తెలియదా అంటూ ఆమె ఆ ప్రముఖ పత్రిక పై వేసిన సెటైర్లు బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.  దీపిక తాజా చిత్రం ‘ఫైండింగ్ ఫన్నీ’ లో ఆమె నటనను విమర్శకులు చాలామంది ప్రశoసిస్తూ ఉంటే ఆ ఆంగ్ల పత్రిక తన ఆన్ లైన్ పోర్టల్ లో దీపిక స్తన అందాలను చూపుతూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీనితో రెచ్చిపోయిన దీపిక ఆ పత్రికను టార్గెట్ చేస్తూ మాటల దాడి మొదలు పెట్టింది. దీపిక పెట్టిన ట్విట్ కు మద్దతుగా అప్పుడే దాదాపు నాలుగు వేలమంది ట్వీట్ చేయడం ఈ రోజు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.  గ్లామరస్ గా కనిపించడంలో ముందు ఉండే దీపిక ఇలా భద్రకాళిలా మీడియా పై ఎదురు దాడి చేయడం బట్టి నేటి హీరోయిన్స్ లో సామాజిక చైతన్యం మరోసారి రుజువు అయింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: