క్రియేటివ్ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ’ ఆడియో వేడుక అత్యంత అట్టహాసంగా నిన్న సాయంత్రం చెన్నైలోని ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ సినిమాలో విక్రమ్‌ ధరించిన వింత మృగ ఆకార గెటప్ తో హీరోయిన్ అమీ జాక్సన్ ను ఎత్తుకుని వేలాదిమంది చూస్తూ ఉండగా వేదిక పైకి రావడం ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. అంతేకాదు ఈ వింత మృగ ఆకారంతో విక్రమ్ హీరోయిన్ అమీ జాక్సన్ తో ఆడియో వేడుకలో డాన్స్ చేయడం చూసిన అతిధులు రజినీకాంత్, ప్రముఖ హాలీవుడ్ ఆర్నాల్డ్ చూసి ఆనంద పడటమే కాకుండా నిలబడి క్లాప్స్ కొట్టడం ఈ ఆడియో వేడుకకు హైలెట్ గా మారింది. అంతేకాదు దర్శకుడు శంకర్ అవకాసం ఇస్తే తాను శంకర్ దర్సకత్వంలో నటించడానికి సిద్దంగా ఉన్నాను అంటూ ఆర్నాల్డ్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. తెలుగులో కూడ ఈ సినిమాను గతంలో ప్రకటించిన విధంగా ‘మనోహరుడు’ పేరుతో కాకుండా ‘ఐ’ పేరుతోనే విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ సినిమా ఆడియో వేడుకలో రెహమన్ తో కలిపి పాట పాడటంతో ఈ కార్యక్రమానికి మరింత జోష్ పెంచింది.  కార్యక్రమానికి రజనీకాంత్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆడియో సీడీని విడుదల చేశారు. కన్నడ నటుడు పునీత్‌రాజ్‌కుమార్‌ తొలి సీడీని అందుకున్నారు. 'భారతదేశంలో చాలా ప్రాంతాలకు వెళ్లాను. కానీ చెన్నైకి రావడం ఇదే ప్రథమం. వాస్తవానికి ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి అతిథిగా హాజరుకాలేదు. శంకర్‌ వద్ద ఓ సినిమా అవకాశం కోసం వచ్చాను’ అంటూ ఆర్నాల్డ్ మాట్లాడిన మాటలు ఈ సినిమా పైనా ముఖ్యంగా శంకర్ పైనా విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చాయి. ఈ వార్తలను బట్టి ‘ఐ’ కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడ సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయం అని అనిపిస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: