ఒక మూవీకి సంబంధించిన టీజర్ ని, అలాగే ట్రైలర్స్ ని సోషియల్ నెట్ వర్కింగ్ లో అప్ లోడ్ చేసి, వాటికి ప్రమోషన్స్ చేస్తే కాని ఆ మూవీకి హైప్ క్రియేట్ అవ్వదు. అయితే తాజాగా శంకర్ దర్శకత్వం వహించిన ఐ మూవీ టీజర్ యూ ట్యూబ్ లోకి అప్ లోడ్ చేశారు. ఆ టీజర్ ని విడుదల చేసింది రాత్రి సమయలో అయినా, ఆ ఒక్క రాత్రికే ఆ వీడియోని దాదాపు 8 లక్షల మంది చూశారు. అంతే కాకుండా ఐ టీజర్ ని మొదటి రోజు పూర్తైయ్యేసరికి, దానిక చూసిన యూ ట్యూబ్ యూజర్స్ సంఖ్య దాదాపు 21 లక్షల మందికి పైగా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఐ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయన్న విషయం అర్ధం అవుతుంది. ఈ విషయంపై దర్శకుడు శంకర్ సైతం స్పంధించాడు. “గతంలో నేను ‘జెంటిల్ మాన్’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’ వంటి సామాజిక సమస్యలతో కూడిన కమర్షియల్ సినిమాలు రూపొందించాను. ‘బాయ్స్’, ‘జీన్స్’ వంటి కామెడీ ఎంటర్టైనర్స్ తెరకేక్కించాను. కాని, ‘ఐ’ వంటి సినిమా తీయలేదు. అందరూ భావిస్తున్నట్టు ఇది సైన్స్ ఫిక్షన్, వోల్ఫ్ మాన్, హల్క్ సినిమా కాదు. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ ఫిల్మ్. నాకు చాలా కొత్త జోనర్. ఈ మూవీ చాలా హై వాల్యూస్ తో తెరకెక్కించింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ తరహా మూవీలు మరిన్ని రావాలి. ఎందుకంటే మన మార్కెట్, ఇతర మార్కెట్ లతో పోల్చుకుంటే చాలా పెద్దది. అందుకే మన మూవీని మన ఇండియాలోనే బిజినెస్ చేసుకుంటే, కోట్ల రూపాయల మార్కెట్ ని చేసుకోవచ్చు” అని దర్శకుడు శంకర్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: