కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హన్సిక అనే పేరు వింటే ముందుగా గుర్తుకు వచ్చేది, శింబు పేరు. అంతాలా వీరిద్దరి పేర్లు జోడీగా అక్కడ వినిపిస్తాయి. ఎందుకంటే హన్సిక, శింబుల ప్రేమ వ్యవహారం, ఎఫైర్ వ్యవహారం, అలాగే తరువాత పెళ్ళి చేసుకోబోతున్నారంటూ గతంలో ఓ రెండు నెలల పాటు జరిగిన హడావిడి వంటి విషయాలు కోలీవుడ్ లో ఓ సంచలనాన్ని క్రియేట్ చేశాయి. అయితే గతంలో విడిపోయిన వీరిద్దరూ ఓ సినిమా కోసం కలిసి పనిచేయాల్సి వచ్చింది. అదే వాలు మూవీ. శింబు హీరోగా నటించిన వాలు మూవీ ఎప్పుడు షూటింగ్ ని పూర్తి చేసుకొని, రిలీజ్ కావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ ఆ మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకోలేక పోయింది. అందుకు పలు కారణాలు ఉన్నాయి. వాలు మూవీ షూటింగ్ కోసం హన్సిక, శింబులు ఇచ్చిన కాల్షీట్స్ లో, వీరు షూటింగ్ కి వెళ్ళకుండా కొన్ని రోజులు టైం వేస్ట్ చేశారు. దీంతో మూవీకి సంబంధించిన షూటింగ్ ఆలస్యం జరిగింది. తరవాత హన్సిక బిజి అయింది. మొదట వాలు చిత్రం కోసం హన్సిక 64 రోజుల కాల్‌షీట్స్ ఇచ్చింది. అవి సరిపోకపోవడంతో మరో 20 రోజులు అడిషనల్ గా ఇచ్చింది. అవి కూడ సరోపోవు మరో 3 రోజులు కావాలని చిత్ర యూనిట్ అడిగితే అందుకే నో అని తెగేసి చెప్పింది. దీంతో ఇప్పటికే పలు కారణాల వల్ల నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం జరిగిన వాలు చిత్రం తాజాగా హన్సిక ప్రకటనతో మరింత చిక్కుల్లో పడినట్లయింది. హీరోయిన్ కారణంగా మూవీ విడుదల ఆగిపోయిందనే కోణంలో హన్సికని తప్పు చూపిస్తూ, తనపై నిర్మాతల మండలిలో పిర్యాదు చేయటానికి శింబు సిద్ధంగా ఉన్నాడంటూ కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే శింబు కూడ వాలు మూవీలో భాగస్వామ్య నిర్మాతగా ఉన్నాడంట. అందుకే తను పిర్యాదు చేస్తున్నట్టుగా తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: