మొన్న విడుదలైన శంకర్ ‘ఐ’ ట్రైలర్ ఇప్పుడు టాలీవుడ్ కు హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి దాకా ఈ సినిమా పై భారీ అంచనాలు లేని టాలీవుడ్ మార్కెట్ విశ్లేషకులు దీపావళికి విడుదల కాబోతున్న ఈ సినిమా ఓపెనింగ్స్ టాలీవుడ్ లో కూడ అధిరి పోతాయి అని ఒక కొత్త వాదానికి తెర తీస్తున్నారు.  ఇప్పటిదాక ‘బాహుబలి’ సినిమా గురించి సంచలనంగా మాట్లాడుకున్న విశ్లేషకులు మీడియా ప్రస్తుతం ‘బాహుబలి’ ని పక్కకు పెట్టి ఇప్పుడు అంతా ‘ఐ’ గురించి ఫోకస్ పెడుతున్నారు. దీనికి కారణం ఆశ్చర్య పరిచే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ‘ఐ’ సినిమా ట్రైలర్ లో కనిపిస్తూ ఉండటం అని అంటున్నారు.  ఇప్పటి వరకు దక్షిణాది సినిమా రంగానికి నిర్మాణ విలువలలో ‘బాహుబలి’ ఒక రోల్ మోడల్ గా మారుతుంది అని అందరు ఊహిస్తూ ఉంటే అందరి అంచనాలను ‘ఐ’ విడుదల కాకుండానే తలక్రిందులు చేయడంతో ప్రస్తుతానికి మీడియాకు హాట్ టాపిక్ గా ‘బాహుబలి’ కన్నా ‘ఐ’ మారింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాహుబలి ప్రతిష్టాత్మక చిత్రమే అయినా కానీ దాని నేపథ్యంలో కొత్తదనం లేదనీ ఒకనాటి రాజుల కధను లేటెస్ట్ హoగులతో రాజమౌళి తీస్తున్నాడు కాని బహుబలిలో ‘ఐ’ సినిమా లాంటి మ్యాజిక్స్ ఉండవనే కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి.  ఈ కామెంట్స్ ఇప్పటికే బాహుబలి సినిమాను అత్యంత భారీ పారితోషికాలతో కొనుక్కున్న బయ్యర్ల దృష్టికి వెళితే ఆ బయ్యర్లు ఇప్పటి నుంచే నిద్రలేని రాత్రులు గడప వలసి వస్తుంది అంటూ కొందరు విశ్లేషకులు శంకర్ ‘ఐ’ సినిమాను రాజమౌళి ‘బాహుబలి’ ని పోలుస్తూ చేస్తున్న కామెంట్స్ అందరికీ అత్యంత ఆశక్తిగా మారాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: