ఒకవైపు పవన్ కళ్యాణ్ చిరంజీవిల మధ్య భేదాభిప్రాయాలు పెరిగిపోయి వారిద్దరి మధ్య గ్యాప్ పూడ్చ లేనంత పెద్దడిగా మారిపోయింది అని మీడియా ఊహగానలు రాస్తూ ఉంటె పవన్ ముద్దుల కూతురు ఆద్య చిరంజీవి ఒడిలో కుర్చుని కెమేరాకు పోజు ఇచ్చిన ఫోటో ఇప్పుడు వెబ్ మీడియాకు హాట్ న్యూస్ గా మారింది. ఈ ఫోటోను ఎవరు ఏ సందర్భంలో తీసారో తెలియకపోయినా చూడటానికి మటుకు ఈ ఫోటో ఈ మధ్యనే క్లిక్ అనిపించిన ఫోటోలా అనిపిస్తోంది. పవన్ కొడుకు అకిరా నందన్, కూతురు ఆధ్యలు తమ తల్లి రేణుదేశాయ్ వద్ద పూణేలో ఉంటున్న నేపధ్యంలో ఈ మధ్య కాలంలో పవన్ కూతురు తన తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఇలా తన పెద్దనాన్న తో తీయిoచుకున్న ఫోటోగా భావించాలి. అందుకే కాబోలు ఆ మధ్య ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తమ్ముడు పవన్ తో తనకున్న భేధాభిప్రాయాల గురించి మాట్లాడుతూ తమ మార్గాలు వేరైనా తమ గమ్యం ఒకటే అని కామెంట్ చేసాడు. చిరంజీవి కామెంట్స్ కు స్పష్టమైన నిదర్శనంగా ఈ ఫోటోను భావించాలి. ఏది ఎలా ఉన్నా చిరంజీవి ఒడిలో గారాలు పోతున్న అధ్య ఫోటో ఈ రోజు వెబ్ మీడియాకు హాట్ న్యూస్.   

మరింత సమాచారం తెలుసుకోండి: