దక్షిణాది సినిమాలకే కాకుండా ఇండియన్ సినిమా రంగానికే సూపర్ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న రజినీకాంత్ ఒక విషయంలో తీవ్రంగా మధన పడుతూ కోర్టు మెట్లేక్కడం మీడియాకు షాకింగ్ గా మారింది. దీనికి కారణం బాలీవుడ్ లో నిర్మాణం అవుతున్న ఒక సినిమా ఆ సినిమా పేరు ‘మై హూ రజనీకాంత్‌’ ఈ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని రజినీకాంత్ ప్రయత్నిస్తున్నాడు అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  ఫైసల్‌ సైఫ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఆదిత్య మీనన్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలోని ఒక కీలక పాత్రలో నటి కవితా రాధేశ్యామ్‌ సెక్స్‌ వర్కర్‌ పాత్రలో కన్పించనుంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఆమె పాత్రలో మరో కోణం, ఆమెకు రజినీకాంత్ అంటే విపరీతమైన పిచ్చి అని తెలుస్తోంది. హీరో వేశ్య పాత్రల మధ్య జరిగే సంభాషణలలో తరుచు రజినీకాంత్ సినిమాల ప్రస్తావన వస్తుందని బాలీవుడ్ మీడియా టాక్. ఈ విషయం రజినీకాంత్ దృష్టికి రావడంతో కోపగించిన రజినీకాంత్ ఈ సినిమా దర్శకనిర్మాతలకు సినిమా కధ విషయంలో మార్పులు చేయమని సూచించాడు అని తెలుస్తోంది. అయితే రజినీ మాటలు ఈ సినిమా దర్శకుడు పట్టించు కోకపోవడంతో ఈ సినిమాలోని హీరో పాత్ర పేరు మార్పు చేయాలని కోరుతూ రజినీ కోర్టును ఆశ్రయించినట్లు కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. మరి ఈ సినిమా విషయంలో కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: