గ్లామర్ అన్న పదానికి వంద మైళ్ళ దూరంలో ఉండే సంపూర్ణేషు బాబు హీరో ఇమేజ్ తెచ్చుకోవడం టాలీవుడ్ అద్భుతాలలో ఒకటి. ‘హృదయ కాలేయం’ సినిమాతో టాప్ హీరోలే కాదు తాను కూడ పంచ్ డైలాగులు చెప్పగలనని వెరైటీగా పంచ్ లు వదిలి తనకంటూ ఎందరో అభిమానులను ఏర్పరుచు కున్నాడు సంపూ.  అయితే ఈ సినిమా విజయం తరువాత ఈ బర్నింగ్ స్టార్ చాల సినిమాలలో నటిస్తున్నాడు అని వార్తలు వచ్చినా ఆ వార్తలు ఏవి కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఈ హీరో పై మంచు ఫ్యామిలీ కన్ను పడిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాతగా వరస పెట్టి సినిమాలు తీస్తున్న మంచు విష్ణు సంపూర్ణేషు బాబుతో ఒక వెరైటీ సినిమాను తీసే పనిలో భాగంగా స్క్రిప్ట్ ను తయారు చేయిస్తున్నాడని టాక్. ఈ మద్య జరిగిన ‘‘కరెంటు తీగ’’ సినిమా ఆడియో కార్యక్రమంలో సంపూ బాబు కన్పించటం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది అని అంటున్నారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సంపూ ఏకంగా ఈ సినిమా ద్వారా కోలీవుడ్ టాప్ హీరో సూర్యాను టార్గెట్ చేయడానికి డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. డీనికి కారణం సూర్య నటించిన ‘సింగం’ టైటిల్ ను ఉపయోగించుకుని, ఆ సినిమాకు సెటైర్ గా ‘సింగం123’ గా వస్తాడట. ఈ టైటిల్ పేరును సంపూర్ణేషు బాబు స్వయంగా హీరో విష్ణుతో ఆలోచించి సలహా ఇచ్చాడు అనే వార్తలు కూడ ఉన్నాయి. అదే మాదిరిగా ‘సింగం’ సినిమాలో పోలీస్ డ్రస్ తో అదరగొట్టిన సూర్య లాగే పోలీస్ డ్రస్ వేసుకుని క్రిమినల్స్ పనిపట్టే పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపిస్తాడట సంపూ. ‘కరెంట్ తీగ’ విడుదల తరువాత ఈ సినిమాకు సంబంధించిన అధికారక ప్రకటన ఉంటుంది అని అంటున్నారు. ఏమైనా సంపూకి మంచు కుటుంబం అండ దొరికింది కాబట్టి దూసుకు పోవడం ఖాయం.  

మరింత సమాచారం తెలుసుకోండి: