పవన్ నటిస్తున్న ‘గోపాలా గోపాలా’ పై ఒక షాకింగ్ రూమర్ ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ వల్ల ఒక సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది అనే వార్తలు గతంలో ఎప్పుడు రాని విధంగా పవన్ ను టార్గెట్ చేస్తూ గోపాలుడి సినిమా పై రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. గతంలో పవన్ సినిమాల నిర్మాణం కొద్దిగా ఆలస్యం అయినా ‘గబ్బర్ సింగ్’ నుండి పవన్ తన వేగాన్ని పెంచాడు. ఇక పూరి జగన్నాథ్ దర్సకత్వంలో నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ను పవన్ అతి తక్కువ కాలంలో పూర్తి చేసి టాలీవుడ్ కు షాక్ ఇచ్చాడు. ‘అత్తారింటికి దారేది’ సినిమా మెగా సక్సస్ తో పవన్ మరింత వేగం పెంచుతాడు అనుకుంటే ‘అత్తారిల్లు’ సినిమా విడుదలై ఒక సంవత్సరం దాటిపోతున్నా రకరకాల కారణాలతో పవన్ తాను నటించిన ఒక్క సినిమా కూడ మొదలు పెట్టి పూర్తి చేయలేకపోయాడు. ఎన్నికల హడావిడి తరువాత పవన్ మేకప్ వేసుకుని నటిస్తున్న ‘గోపాలా గోపాలా’ షూటింగ్ లో పవన్ ప్రవర్తన పై అందర్నీ ఆశ్చర్యపరిచే గాసిప్పులు బయట హడావిడి చేస్తున్నాయి. 'గోపాల గోపాల' షూటింగ్‌లో ఎక్కువసేపు పవన్ ఉండలేకపోతున్నాడని, ఎప్పుడు లేని విధంగా షూటింగ్ సన్నివేశాల చిత్రీకరణ విషయంలో పెద్దగా ఆశక్తి చూపడం లేదనే వార్తల హడావిడి జోరుగా జరుగుతోంది. అంతేకాదు ఈ మూవీలో వెంకటేష్ తో ఉన్న కాంబినేషన్ సీన్స్ చిత్రీకరణ సమయంలో అరగంట సెట్లో ఉంటే 3- 4 గంటలు రెస్ట్ తీసుకుంటున్నాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి. అసలు పవన్ ఎందుకింత అసౌకర్యంగా ఉంటున్నాడో ఎవరికీ అంతుపట్టడంలేదట. షెడ్యూల్స్ మారుతున్నా, షూటింగ్ ముందుకు కదలక పోవడంతో కో ఆర్టిస్ట్స్ డేట్స్ వృధా అవుతున్నాయని ఈ సినిమా యూనిట్ వారు సైలెంట్ మోడ్‌లో అనుకుంటున్నారని టాక్. ఈ సినిమాలో పవన్ చేసేది 40 నిమిషాల క్యారెక్టరే అయినా షూటింగ్‌కు ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియక ఈ సినిమా యూనిట్ సభ్యులు అయోమయంగా ఉన్నారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే పవన్ ఈ విధంగా ప్రవర్తించడం వెనుక పవన్ ను బాధ పెడుతున్న వెన్ను నొప్పా? లేదా మరేదైనా కారణమా అనే విషయాల పై స్పష్టత లేదు అని కూడ అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: