మరికొద్ది గంటలలో టాక్ బయటకు రాబోతున్న ‘ఆగడు’ సినిమా పబ్లిసిటీకి ఈ సినిమా నిర్మాతలు 3కోట్లు పబ్లిసిటీ పై ఖర్చు పెట్టడం టాలీవుడ్ కు షాకింగ్ గా మారింది. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇలా దేనిని వదలకుండా మీడియాను ‘ఆగడు’ హోరుతో హోరెత్తించి వేసారు ఈ సినిమా నిర్మాతలు. అంతేకాదు ఈ సినిమా పబ్లిసిటీ కోసం కొన్ని ప్రముఖ బ్రాండ్స్ సహకారం కూడ తీసుకుని భారీ పబ్లిసిటీ చేస్తున్నారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా 2000 వేల ధియేటర్లలో విడుదల అయిన ‘ఆగడు’ ఉత్తర భారతదేశంలోనే 110 ధియేటర్లలో విడుదలకావడం సంచలనంగా మారింది. మొన్న బుధవారం విశాఖపట్నంలో దాదాపు 4000ల మంది మహేష్ అభిమానులు 12,019 అడుగుల పొడవుతో పోలీసు బెల్ట్ గా మానవహారం క్రియేట్ చేసి గిన్నీస్ బుక్ కు ఈ ఫోటోలను పంపినట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఈ సందర్భంలో మహేష్ వీరాభిమాని, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ మహేష్ బాబు సినిమా తమ జీవితాలకంటే ఎక్కువ అని సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా మహేష్ క్రియేట్ చేసే రికార్డులను టాలీవుడ్ లో ఏ హీరో అందుకోలేడు అని మాట్లాడిన మాటలు టాలీవుడ్ కు షాకింగ్ గా మారాయి. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగ కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ లో ‘ఆగడు’ విడుదల కావడం సంచలనంగా మారింది. అదేవిధంగా ఆఫ్రికా ఖండంలోని నైజీరియా దేశంలో కూడ ‘ఆగడు’ సందడి చేయబోతోంది. ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి కేవలం భాగ్యనగరంలోనే 20 ధియేటర్లలో స్పెషల్ షోలుగా ప్రదర్శింప బడ్డ ‘ఆగడు’ టికెట్ల ధర 1000 నుండి 5000 వరకు అమ్మడం సంచలనంగా మారింది. ఏమైనా ఎలా ఉన్నా ‘ఆగడు’ ఎటువంటి రిజల్ట్ మహేష్ కు ఇవ్వబోతోందో మరి కొద్ది సమయంలో తేలిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: