వెబ్ మీడియా సంస్కృతి అందరికి అందుబాటులో రావడంతో టాలెంట్ ఉన్న వాళ్ళు తమ టాలెంట్ ను ప్రముఖ దర్శక నిర్మాతల దృష్టిలో పడేడట్లుగా తాము నిర్మించిన షార్ట్ ఫిలిమ్స్ ను అందరి దృష్టిలో పడేడట్లుగా యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ సినిమా రంగంలో అవకాసాలను సులువుగా అందుకుంటున్నారు. టాలెంట్ కనిపిస్తే చాలు ప్రోత్సహించే పూరి జగన్నాథ్ మనసుదోచిన "పెళ్లి తో జర భధ్రం" షార్ట్ ఫిలిం ఇప్పుడు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. పెళ్ళి తరువాత వచ్చే కష్టాలను వివరించే ఈ షార్ట్ ఫిలింలో నటించిన నటుడు తన మిత్రుడుకి పెళ్ళి వద్దు అంటూ తాను తన భార్యతో పడుతున్న కష్టాలను ఏకధాటిగా చెపుతూ కొన్ని నిముషాల పాటు సాగే ఈ షార్ట్ ఫిలిం చాలామందిని ఆకర్షిస్తోంది.  కమలహాసన్ నటించిన ‘సతీ లీలావతి’ సినిమాలోని కమల్ పాత్ర మాడ్యులేషన్ ను అనుకరిస్తూ ఈ యువ నటుడు చేసిన ప్రయోగం పూరి జగన్నాథ్ కు నచ్చడమే కాకుండా అతడికి తాను తీస్తున్న సినిమాలో ఒక పాత్రను క్రియేట్ చేసి ఇస్తాను అంటూ పూరి ఈ షార్ట్ ఫిలింను చూసి దాన్ని అందరికి తెలిసేలా తన ఫేస్ లో షేర్ చేసుకున్నాడు.  ఇందులో నటించిన ఆ యువకళాకారుడి ప్రతిభను చూస్తే టాలీవుడ్ కు మరో మంచి కమెడియన్ దొరికాడు అని ఎవరికైనా అనిపిస్తుంది. పూరి తన ఫేస్ బుక్ లో ‘నేను మీలాంటి నటుల కోసం చూస్తున్నాను.. నువ్వు నా ఇన్ భాక్స్ లో మెసేజ్ పెట్టి మిగతా డిటేల్స్ కోసం వెయిట్ చెయ్’ అంటూ పెట్టిన మెసేజ్ ‘పెళ్ళితో జర భధ్రం’ కు మంచి జోష్ ఇస్తుందని అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: