ఎన్నో అంచనాలతో ఈ రోజు ఉదయం విడుదల అయిన మహేష్ బాబు ‘ఆగడు’ ను ఏదోవిధంగా బ్లాకు బస్టర్ హిట్ చెద్దామన్నదర్శకుడి శ్రీను వైట్ల ఆత్రుత తెలుగు భాషను ప్రేమించే వారికి వెగటుగా మారింది అనే ఘాటు కామెంట్లు వినపడుతున్నాయి. అంతే కాదు జనాన్ని ఆకర్షించడానికి తెలుగు భాషను ఇంత ఘోరంగా ఖూని చెయ్యలా అనే కామెంట్స్ కుడా వినపడుతున్నాయి.  కేవలం ప్రాస కోసమే తిప్పలు పడుతూ మహేష్ వదిలిన పంచ్ డైలాగ్స్ లోని చీప్ డబల్ మీనింగ్ పదాలను సెన్సార్ కత్తెర వేసినా ఆ గ్యాప్ లో వచ్చిన బీప్ శబ్దాలను బట్టి మహేష్ లాంటి పేరున్న ప్రముఖ హీరో నోటి వెంట డబల్ మీనింగ్ డైలాగులు వచ్చాయా అని ఆశ్చర్యపోయేలా చేసిందని ఈ సినిమాను చూసిన కొంతమంది బహిరంగం గానే కామెంట్ చేస్తున్నారు. ఈవార్తలు ఇలా ఉండగా ‘ఆగడు’ హిట్ టాక్ తెచ్చుకున్నా ‘దూకుడు’ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా మారడం కష్టం అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ‘ఆగడు’ మొదటి రోజు కలెక్షన్స్ 8 కోట్ల నుండి 10 కోట్ల మధ్య ఉంటుందని టాలీవుడ్ కలెక్షన్ విశ్లేషకులు అప్పుడే ఈ సినిమా పై ఒక అంచనాకు వచ్చినట్లు గా వార్తలు వస్తున్నాయి. ఆగడు మహేష్ అభిమానులను పూర్తిగా ఆనంద పరిచినా మామూలు ప్రేక్షకుల అంచనాలను నూటికి నూరు శాతం ‘ఆగడు’ అందుకోవడం కష్టం అనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకే కాబోలు మహేష్ ఈ సినిమాలో తన పై తానే సెటైర్ వేసుకుంటూ కంటెంట్ తక్కువగా ఉంటే పబ్లిసిటీ భీకరంగా ఉంటుంది అనే డైలాగ్ ను ఒక సందర్భంలో వాడాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: