మాండలిన్ విద్వాంసుడు పద్మశ్రీ శ్రీనివాస్(45) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతిచెందారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 1968, ఫిబ్రవరి 28లో జన్మించారు. కళారంగంలో చేసిన కృషికిగాను 1998లో పద్మశ్రీ, 2010లో సంగీత నాటక అకాడమీ అవార్డులు శ్రీనివాస్‌ను వరించాయి. అంతర్జాతీయ స్థాయిలో పెద్దపెద్ద విద్వాంసులతో కలిసి కచేరీలలో పాల్గొన్న శ్రీనివాస్‌ అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయస్థాయిలో ఎదిగిన తెలుగు కళాకారుడు అతిచిన్న వయసులో పరమపదించడం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు. శ్రీనివాస్‌ కన్నుమూతపై జాతీయస్థాయిలో నేతలు, ప్రధాని దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: