“దృశ్యం” ఇచ్చిన జోష్ తో వెంకటేష్ తనస్పీడును పెంచుతున్నాడు. ప్రస్తుతం పవన్ తో నటిస్తున్న ‘గోపాలా గోపాలా’ విడుదల అయిన వెంటనే మరో రీమేక్‌లో నటించేందుకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ లో ఈమధ్యే రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకున్న 'సలీం' మూవీని తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నంలో ఈ సినిమా హక్కులను కొన్నట్లు గా ఫిలిం నగర్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 'సలీం'లో విజయ్ ఆంటోనినటించిన పాత్రలో వెంకీ కనిపిస్తాడని టాక్. తమిళ్ వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన ఎన్‌వి నిర్మల్ కుమార్ తెలుగు వెర్షన్‌ని డైరెక్ట్ చేయడానికి వెంకీ ఎంపిక చేసుకున్నాడు అనే వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ రీమేక్‌కి సంబంధించి త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుందని ఫిలింనగర్ టాక్. గతంలో తనకు కలిసి వచ్చిన రీమేక్ కల్చర్ ను నమ్ముకుని వెంకటేష్ తిరిగి తన సినిమాల స్పీడు పెంచడమే కాకుండా యంగ్ హీరోల తో సమానంగా వరుస పెట్టి సినిమాలు చేయడం సంచలనంగా మారింది. ఈ సినిమా కూడ విజయవంతం అయితే వెంకీ మరోసారి రీమేక్ రారాజు గా మారిపోతాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: