సుమారు 60 మంది హీరోయిన్స్ తో స్టెప్పులు వేసి రొమాంటిక్ సన్నివేశాలలో నటించిన అక్కినేని నాగేశ్వరరావుకు డ్రీమ్ గర్ల్, అత్త పాత్రలకు చిరునామాగా మిగిలిపోయిన సూర్యకాంతం అంటే ఎవరు నమ్మరు. కానీ ఇది ముమ్మాటికి నిజం. అక్కినేని జీవించి ఉన్న రోజులలో తన పుట్టినరోజు సందర్భంగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. అక్కినేని నటించిన ‘భార్య భర్తలు’ షూటింగ్ సమయంలో ఆ సినిమాలో నటిస్తున్న సూర్యకాంతం అద్దం ముందు నుంచుని తలదువ్వుకునే సీన్ ఉందట, ఆ సీన్ లో వెనక సోఫాలో కూర్చున్న అక్కినేని ఆ సీన్ లో నటిస్తూనే లావుగా ఉన్నా కళగా ఉంది సూర్యకాంతం మొఖం అని మనసులో అనుకున్నారట అక్కినేని.  అయితే ఆరోజు ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి నిద్రపోయిన తరువాత అక్కినేనికి సూర్యకాంతం కలలోకి వచ్చిందట. దానితో ‘ఏ—ఏ –ఏ’ అంటూ పెద్ద అరుపుతో లేచి కూర్చున్నారట అక్కినేని. ఆ అరుపులకు ఉలిక్కి పడిలేచిన అక్కినేని భార్య అన్నపూర్ణ ఏమైంది అని అడిగితే అక్కినేని తనకు సూర్యకాంతం కలలోకి వచ్చింది అని చెప్పారట. దీనితో షాక్ అయిన అన్నపూర్ణ ‘సావిత్రో, జమునో. క్రిష్ణకుమారో కలలోకి రావాలి కాని సూర్యకాంతం ఏమిటి మరీ భయంకరంగా’ అంటూ అక్కినేని పై సెటైర్ వేసి బుద్దిగా పడుకోమని చెప్పిందట అన్నపూర్ణ. ఈ సంఘటన జరిగి చాల సంవత్సరాలు గడిచిపోయినా తనకు ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా తెగ నవ్వు వస్తుందని బహుశా తన సబ్ కాన్షియస్ మైండ్ లో డ్రీమ్ గర్ల్ గా సూర్యకాంతం రిజిస్టరై పోవడం వల్ల తనకు అటువంటి కల ఆరోజు వచ్చి ఉంటుందని అక్కినేని అలనాటి విషయాలను గుర్తుకు చేసుకుంటూ తన పుట్టినరోజు సందర్భంగా తాను జీవించి ఉన్న రోజులలో తన డ్రీమ్ గర్ల్ గుట్టు విప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: